Begin typing your search above and press return to search.

యాక్సిడెంటల్ పీఎం.. రెస్పాన్స్ దారుణంగా ఉందే!

By:  Tupaki Desk   |   11 Jan 2019 5:38 PM GMT
యాక్సిడెంటల్ పీఎం.. రెస్పాన్స్ దారుణంగా ఉందే!
X
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు మీడియా అడ్వైజర్ గా.. పీఎంఓ కు స్పోక్స్ పర్సన్ గా పనిచేసిన సంజయ్ బారు రాసిన 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' అనే పుస్తకం ఆధారంగా అదే టైటిల్ తో సినిమాను తెరకెక్కించారు. సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ఈ సినిమాలో మన్మోహన్ సింగ్ పాత్రలో నటించగా.. సంజయ్ బారు పాత్రలో అక్షయ్ ఖన్నా.. సోనియా గాంధి పాత్రలో సుజాన్ బెర్నెట్ నటించింది. విజయ్ రత్నాకర్ గుత్తే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈరోజే విడుదలయింది.

ఈ సినిమాకు ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చిందిగానీ లీడింగ్ మీడియా హౌసులన్నీ 1 నుండి 1.5 స్టార్స్ రేటింగ్ ఇచ్చాయి. హిందూస్తాన్ టైమ్స్ ఒక్క స్టార్ రేటింగ్ ఇస్తూ "కుటుంబ రాజకీయాల వల్ల ఎలాంటి పరిణామాలు చేసుకుంటాయి అనే విషయంపై ఫోకస్ చేస్తూ కావాలని ఎలెక్షన్స్ కు కొద్ది నెలల ముందు తీసిన చిత్రం" అని వ్యాఖ్యానించారు. ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ అయితే అసలు ఒక్క స్టార్ రేటింగ్ కూడా ఇవ్వకుండా " మాజీప్రధాని ని బలహీనుడిగా.. వెన్నెముక లేని వ్యక్తిగా.. ఒక బొమ్మలా చిత్రీకరిస్తూ ఆ బొమ్మను 'ఆ కుటుంబం' ఆడించినట్టు చూపించే ప్రచారమే ఇది" అంటూ తేల్చేశారు. ఇక ఎన్డీటీవీ వారు 1.5 స్టార్స్ రేటింగ్ ఇస్తూ "ఎంగేజింగ్ డ్రామా లేదు.. ఎంటర్టైనింగ్ గా కూడా లేదు" అని తేల్చేశారు.

ఇదిలా ఉంటే కొందరు నెటిజనులు మాత్రం కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులైన మీడియా సంస్థలు కావాలని ఇలాంటి రివ్యూలు రేటింగ్స్ ఇచ్చారని.. మన్మోహన్ విషయంలో ఉన్నదున్నట్టు చూపిస్తే.. నచ్చడం లేదని.. సోనియా గాంధీ మన్మోహన్ ను పప్పెట్ లాగా ఆడించిన విషయం నిజంకాదా అని ప్రశ్నిస్తున్నారు. ఏంటో.. ఎవరి వాదన వారిది.