Begin typing your search above and press return to search.

షేక్ చేసేందుకు అభిషేక్ రెడీ

By:  Tupaki Desk   |   28 July 2016 4:35 AM GMT
షేక్ చేసేందుకు అభిషేక్ రెడీ
X
గత కొంత కాలంగా టాలీవుడ్ లో బాగా ఎక్కువగా ఎక్కువగా వినిపిస్తున్న డిస్ట్రిబ్యూషన్ హౌజ్ అభిషేక్ పిక్చర్స్. నచ్చిన సినిమాలను హోల్ సేల్ గా కొనేయడం.. భారీ చిత్రాలకు అంతకంటే భారీ క్రేజీ ఆఫర్స్ ఇచ్చి రైట్స్ దక్కించుకోవడంలో.. ఈ నైజాం బేస్డ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ బాగా పాపులర్ అయిపోయింది. ఇప్పుడీ అభిషేక్ పిక్చర్స్.. నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టి సినిమాలు తీయడానికి రెడీ అయిపోయింది.

సినిమా తీయడమంటే ఒకటి తర్వాత ఒకటి కూడా కాదు.. ఒకేసారి ఐదు సినిమాలను అభిషేక్ పిక్చర్స్ నిర్మించనుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ తో ఓ సినిమా స్టార్ట్ కానుంది. స్వామి రారా ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో మరో చిత్రం కూడా అభిషేక్ పిక్చర్స్ నిర్మించనుంది. క్షణం దర్శకుడు రవికాంత్ పెరెపు తీసే రెండో సినిమాకి నిర్మాణం వహించేది కూడా ఈ సంస్థే. సుధీర్ బాబు హీరోగా పుల్లెల గోపీచంద్ బయోపిక్ ని తీసేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైపోయింది.

శ్రీనివాస్ అవసరాల లీడ్ రోల్ లో చేయనున్న బాలీవుడ్ హంటర్ రీమేక్ ప్రాజెక్ట్ రీసెంట్ గా కన్ఫాం అయింది. ఒకే సారి 5 సినిమాల నిర్మాణం.. అన్నీ క్రేజీ డైరెక్టర్లు హ్యాండిల్ చేసేవే. అభిషేక్ పిక్చర్స్ అడుగు పెట్టడంతోనే షేక్ చేసే ప్లాన్స్ ఏవో వేసుకుని వచ్చేస్తున్నట్లుంది.