Begin typing your search above and press return to search.

దిల్ రాజు ప్ర‌త్య‌ర్థి...ఇదేం దూకుడు బాబోయ్‌

By:  Tupaki Desk   |   23 Aug 2016 5:30 PM GMT
దిల్ రాజు ప్ర‌త్య‌ర్థి...ఇదేం దూకుడు బాబోయ్‌
X
నైజాం ఏరియాలో దిల్ రాజు ఏక ఛత్రాధిప‌త్యానికి తెర‌దించిన డిస్ట్రిబ్యూట‌ర్ అభిషేక్. దిల్ రాజుతో పోటీ ప‌డి వ‌రుస‌గా భారీ చిత్రాల్ని సొంతం చేసుకుని డిస్ర్రిబ్యూష‌న్ లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు సాధించిన అభిషేక్.. ఇటీవ‌లే నిర్మాత అవ‌తారం కూడా ఎత్తాడు. ఒకేసారి ఐదు సినిమాలు ప్ర‌కటించి సంచ‌ల‌నం సృష్టించాడు.

త‌న దూకుడు అంత‌టితో ఆప‌కుండా ఇంత‌లోనే ఇప్పుడు అభిషేక్ మ‌రో కొత్త బిజినెస్ కు తెర‌తీశాడు. అత‌ను ఆడియో రంగంలోకి కూడా అడుగు పెట్టేశాడు. ఎ మ్యూజిక్ పేరుతో కొత్త‌గా ఆడియో కంపెనీ మొద‌లుపెట్టాడు అభిషేక్. ఏం చేసినా భారీగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్న అభిషేక్ ఓ పెద్ద సినిమాతో ఈ ఆడియో సంస్థను లాంచ్ చేయాల‌ని చూస్తున్నాడు. ప్ర‌స్తుతం టాలివుడ్ లో ఉన్న ఆడియో కంపెనీల‌కు అభిషేక్ స‌వాలు విస‌ర‌డం ఖాయ‌మే.

ఇక అభిషేక్ నిర్మిస్తున్న సినిమాల విష‌యానికి వ‌స్తే.. ముందుగా బెల్లంకొండ సురేష్ త‌న‌యుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో సినిమా సెట్స్ మీదికి వెళ్తుంది. త‌ర్వాత నిఖిల్ - సుధీర్ వ‌ర్మ కాంబినేష‌న్ లో ఓ సినిమా.. క్ష‌ణం టీమ్ తో ఓ సినిమా.. గోపీచంద్ జీవిత చ‌రిత్ర నేప‌థ్యంలో సుధీర్ బాబు - ప్ర‌వీణ్ స‌త్తారు కాంబినేష‌న్ లో మ‌రో సినిమా.. అవ‌స‌రాల శ్రీనివాస్ హీరోగా హంట‌ర్ రీమేక్ చేయ‌నున్నాడు.