ఐష్-అభి.. ఆ హగ్ అదిరిపోయింది

Wed Jan 04 2017 23:00:02 GMT+0530 (IST)

రీసెంట్ గా జరిగిన స్టార్ డస్ట్ అవార్డుల కార్యక్రమంలో ఐశ్వర్యారాయ్ అవార్డ్ అందుకుంది. సరబ్ జిత్ మూవీలో ఆమె చూపిన యాక్టింగ్ ట్యాలెంట్ కు గాను.. ఈ అవార్డ్ అందుకుంది. అయితే.. ఈ అవార్డ్ ను ఆమె తన మామగారైన అభిషేక్ బచ్చన్ చేతుల మీదుగానే అందుకునే అవకాశం వచ్చింది.

కానీ ఆఖరి నిమిషంలో ఐష్ మాంచి ట్విస్ట్ ఇచ్చింది. తనకు ఈ అవార్డును భర్త అభిషేక్ బచ్చన్ తో కలిసి అందుకోవాలనే కోరిక వెలిబుచ్చింది. అభి లేకుండా తాను ఈ విజయం సాధించగలిగేదాన్ని కాదన్న ఐశ్వర్య.. భర్తతో కలిసి అవార్డ్ అందుకోవడాన్ని ప్రౌడ్ గా ఫీలవుతానని అనింది. ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న అభిషేక్.. తన భార్య కోరిక వినగానే.. చకచకా స్టేజ్ పైకి వచ్చాడు. ఆమెతో కలిసి బిగ్ బీ చేతుల మీదుగా ఈ అవార్డ్ అందుకున్నాడు. తన భార్య సాధించిన విజయాన్ని తెగ పొగిడేశాడు అభిషేక్.

ఇదంతా పూర్తవగానే భర్త అభిషేక్ బచ్చన్ ను మనసారా గట్టిగా వాటేసుకుంది ఐశ్వర్యారాయ్. తన వీరిద్దరి మధ్య అనుబంధం ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఇదొక్క ఉదాహరణ చాలు. ఇంకా అభిషేక్-ఐశ్వర్యల మధ్య డిఫరెన్సులు అంటూ ప్రచారం చేసేవాళ్లకు సమాధానం ఇదొక్క ఎపిసోడ్ సరిపోతుంది కదూ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/