బిగ్ బీకి జూనియర్ బీ బర్త్ డే విషెస్!

Thu Oct 12 2017 17:54:03 GMT+0530 (IST)

అక్టోబర్ 11న బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ 75వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న సంగతి తెలిసిందే. బిగ్ బీ పుట్టిన రోజు సందర్భంగా ట్విట్టర్లో అభిమానుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. గత ఏడాదిలా కాకుండా ఈ సారి అమితాబ్ తన జన్మదిన వేడుకలను కుటుంబసమేతంగా మాల్దీవులలో జరుపుకున్నారు. వీరంతా అక్కడి ఓ లగ్జరీ రిసార్ట్ లో బస చేసినట్లు సమాచారం. అక్కడి  ప్రైవేట్  బీచ్ లో వారందరూ పార్టీ చేసుకుని బాగా ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది. అక్కడ అమితాబ్ బచ్చన్ కు అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్యరాయ్ బచ్చన్ - శ్వేతా నందలు సర్ ప్రైజ్ ఇచ్చారట. బచ్చన్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ముందుగా అక్టోబర్ 10న అమితాబ్ - అభిషేక్ - ఐశ్వర్యా రాయ్ లు ముంబై నుంచి మాల్దీవులకు వెళ్లారు. ఆ తర్వాత శ్వేతా నంద - ఆమె కూతురు నవ్య నవేలి అక్కడికి వెళ్లారు. బర్త్ డే సందర్భంగా ఒక పెద్ద కేకును అమితాబ్ తో కట్ చేయించి - బాణా సంచా కాల్చారట. ఆ తర్వాత అంతా కలిసి క్రూయిజ్ పార్టీ కూడా చేసుకున్నారు. వారంతా కలిసి....`హ్యాపీ బర్త్ డే` ఆంగ్ల అక్షరాలను బాణసంచాతో వెలిగించి బిగ్ బీకి విషెస్ చెప్పారు. ఆ మండుతున్న అక్షరాలను చూస్తున్న బిగ్ బీ ఫొటోను అభిషేక్ తన ఇన్ స్టాగ్రాం అకౌంట్లో పోస్ట్ చేశాడు. 75 వసంతాలు గడిచినా ఇంకా స్టైల్ గానే ఉన్నారు....హ్యాపీ బర్త్ డే పా....అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గత ఏడాది అభిషేక్ బచ్చన్ పుట్టిన రోజును కూడా బచ్చన్ కుటుంబం మాల్దీవుల్లోనే సెలబ్రేట్ చేసుకుంది.