Begin typing your search above and press return to search.

అత‌డికి వ‌ర్మ కూడా అన్యాయం చేశాడే..

By:  Tupaki Desk   |   26 Aug 2016 4:40 AM GMT
అత‌డికి వ‌ర్మ కూడా అన్యాయం చేశాడే..
X
పులి క‌డుపున పులే పుడుతుందంటారు.. అలాగే పండిత పుత్ర అంటూ ఇంకో మాట కూడా ఉంది. కొంద‌రి విష‌యంలో మొద‌టిది జ‌రుగుతుంటుంది. ఇంకొంద‌రి విష‌యంలో రెండోది జ‌రుగుతుంటుంది. అభిషేక్ బ‌చ్చ‌న్ ఏ కోవ‌కు చెందుతాడో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఇండియాలోనే అతి పెద్ద స్టార్ కొడుగ్గా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన అభిషేక్.. అంచ‌నాల్ని అందుకోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. అత‌డి కెరీర్లో చాలా వ‌ర‌కు ఫ్లాపులే. హిట్ల‌యిన‌వాటిలో కూడా అత‌డి ప్ర‌మేయం త‌క్కువే. అభిషేక్ ను స‌రిగా వాడుకుని.. అత‌డి నుంచి ఓ మోస్త‌రు న‌ట‌న‌ ద‌ర్శ‌కులు ఇద్ద‌రే ఇద్ద‌రు. ఒక‌రు మ‌ణిర‌త్నం.. ఇంకొక‌రు రామ్ గోపాల్ వ‌ర్మ‌.

ఐతే ‘రావ‌ణ్’ దెబ్బ‌కు మ‌ణి కూడా అభిని వ‌దిలేశాడు. ఇప్పుడు వ‌ర్మ సైతం స్మాల్‌-బికి అన్యాయం చేసేశాడు. ‘స‌ర్కార్’ సిరీస్ లో మూడో సినిమా తీయబోతున్న‌ట్లు ప్ర‌క‌టించిన వ‌ర్మ‌.. అందులో అభిషేక్ కు చోటు లేద‌ని తేల్చేశాడు. ‘స‌ర్కార్’ తొలి రెండు భాగాల్లో అభిషేక్ కీల‌క పాత్ర పోషించాడు. బాగానే న‌టించాడు. ఐతే మూడో భాగంలోనూ అభిషేక్ ఉంటే మొనాట‌నీ వ‌స్తుంద‌నుకున్నాడో ఏమో.. అత‌డికి ఇందులో చోటు లేద‌ని స్ప‌ష్టం చేశాడు. ‘స‌ర్కార్’ రెండో భాగం ‘స‌ర్కార్ రాజ్ లో ఉన్న ఐశ్వ‌ర్యా రాయ్‌ కు కూడా మూడో పార్టులో చోటు లేన‌ట్లే. శుక్ర‌వార‌మే స‌ర్కార్-3 ఫ‌స్ట్ లుక్ రిలీజ్ కావాల్సింది. అనివార్య కార‌ణాల వ‌ల్ల వాయిదా వేస్తున్న‌ట్లు తెలిపాడు వ‌ర్మ‌.