హారర్ ఫీల్ తెప్పిస్తున్న అభినేత్రి 2 పోస్టర్

Mon Apr 15 2019 22:03:11 GMT+0530 (IST)

ప్రభుదేవా.. తమన్నా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న 'అభినేత్రి-2' (తమిళం లో 'దేవి 2') మే 1 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు.  2016 లో 'అభినేత్రి' టైటిల్ తో రిలీజ్ అయిన హారర్ కామెడీ చిత్రానికి సీక్వెల్ గా ఈ 'అభినేత్రి 2' తెరకెక్కుతోందని తెలిసిందే.  అమలా పాల్ మాజీ భర్త ఎ ఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ను 16 వ తేదీన.. అంటే మంగళవారం రిలీజ్ చేస్తున్నామని నిర్మాతలు ప్రకటించారు.ఈసందర్భంగా టీజర్ రిలీజ్ డేట్ పోస్టర్ ను విడుదల చేశారు.  మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు 'అభినేత్రి 2' టీజర్ రిలీజ్ అవుతుంది.  ఇక టీజర్ పోస్టర్ విషయానికి వస్తే మోడరన్ గా గ్రీన్ కలర్ గౌన్ లో ఉన్న తమన్నాను వెనకనుంచి కౌగలించుకున్న హీరో ప్రభుదేవా కళ్ళు మూసుకుని తన్మయత్వంలో ఉన్నాడు.. కానీ తమన్నా మాత్రం కళ్ళు తెరిచి నవ్వుతూ చూస్తూ ఉంది. ఇక ముందు నుంచి ఒక దెయ్యం చెయ్యి.. వెనక నుంచి మరో దెయ్యం చెయ్యి ప్రభుదేవా ను పట్టుకోవాలని చూస్తున్నాయి. ఈ దెయ్యం చేతులను చూస్తే హారర్ ఫీల్ వస్తోంది.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయని సమాచారం.  సోనూ సూద్..నందితాశ్వేత..డింపుల్ హయాతి.. కోవైసరళ ఇతర కీలక పాత్రల్లో నటించారు.  సామ్ సి.ఎస్ సంగీత దర్శకుడు.  అయనక బోస్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. అభిషేక్ పిక్చర్స్.. ట్రైడెంట్ ఆర్ట్స్ బ్యానర్లపై అభిషేక్ నామా. ఆర్. రవీంద్రన్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.