Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్: మళ్ళీ అదేనా విశాల్

By:  Tupaki Desk   |   18 Nov 2017 6:57 AM GMT
ఫస్ట్ లుక్: మళ్ళీ అదేనా విశాల్
X
అదేంటో ఒక్కో సీజన్లో ఒక్కోసారి ఒకేలాంటి సినిమాలు తెగ వచ్చేస్తుంటాయి. మహేష్‌ బాబు స్పైడర్ తో వచ్చాడు. కార్తి ఖాకితో వచ్చాడు. అలాగే విశాల్ డిటెక్టివ్ తో వచ్చాడు. ఈ మూడు సినిమా కథలూ వేరైనాకూడా.. వీటన్నింటిలోనూ హీరోలు ఒకటే చేస్తుంటారు. అందరూ కూడా ఏదో ఒకటి ఇన్వెస్టిగేట్ చేస్తూ కనిపించారు. కాని విషయం ఏంటంటే.. ఇప్పుడు విశాల్ మరోసారి అదే ఫీట్ చేయబోతున్నాడు అనిపిస్తోంది.

సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్న ''అభిమన్యుడు'' సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశాడు విశాల్. ఈ సినిమా ఫస్ట్ లుక్ చూస్తుంటే.. ఇందులో చాలా సిసిటివి ఫుటేజ్ స్ర్కీన్ల ముందు నుంచున్న విలన్ అర్జున్.. ఆ స్ర్కీన్లలో విశాల్ ముఖాన్ని గమనిస్తున్నాడు. అంటే ఇక్కడ కూడా ఏదో ఇన్సిడెంట్ తాలూకు విషయాలను ఇన్వెస్టిగేట్ చేస్తున్నారనమాట. అంటే మళ్లీ మళ్లీ అలాంటి తరహాల థ్రిల్లర్ సినిమాలను చూస్తుంటే మాత్రం కాస్త షాకింగ్ గానే ఉంటుంది. కాకపోతే మనోళ్ళుమాత్రం అవే కథలను దించుతున్నారు.

ఇకపోతే ఖాకి సినిమాలో ఎలాగైతే సాదాసీదా లుక్స్ లో రకుల్ ప్రీత్ కనిపించిందో.. ఈ సినిమాలో సమంత కూడా అదే సాదాసీదా లుక్ లో కనిపిస్తోంది. మొత్తానికి వైవిధ్యభరితంగా లేని ఫస్ట్ లుక్ తో ముందుకొచ్చాడు అభిమన్యుడు. మరి సంక్రాంతికి పవన్ కళ్యాణ్‌ అండ్ బాలయ్య సినిమాలతో పోటీపడీ ఏం చేస్తాడో చూడాల్సిందే.