Begin typing your search above and press return to search.

సిద్దప్ప నాయుడు సొంతిల్లు కొంటున్నాడు

By:  Tupaki Desk   |   25 May 2016 7:30 AM GMT
సిద్దప్ప నాయుడు సొంతిల్లు కొంటున్నాడు
X
నార్త్ స్టార్లను తీసుకొచ్చి టాలీవుడ్ లో చేయించడం టాలీవుడ్ లో బాగా కామన్. హీరోయిన్లు, విలన్ల విషయంలో మనోళ్లు ఇతర భాషలపై బాగానే డిపెండ్ అవుతుంటూ ఉంటారు. ఓ ముగ్గురు నలుగురు తప్పిస్తే.. విలన్ రోల్స్ ని ఫుల్ ప్లెడ్జెడ్ గా చేయగలిగేవాళ్లు లేరని ఇండస్ట్రీ భావిస్తుంటారు. అందుకే కొత్త కొత్త విలన్స్ మన టాలీవుడ్ కి వచ్చేస్తుంటారు. గబ్బర్ సింగ్ మూవీలో సిద్ధప్ప నాయుడు కేరక్టర్ తో అభిమన్యు సింగ్ కి బిగ్ బ్రేక్ లభించింది. అంతకు ముందు కూడా ఇలాంటి పాత్రలు చేసినా.. పవన్ మూవీ తర్వాత తెగ బిజీ అయిపోయాడు ఈ విలన్.

'ప్రస్తుతం కూడా రెండు తెలుగు సినిమాల్లో విలన్ గా చేస్తున్నా. ఆక్సిజన్ - చుట్టలబ్బాయి చిత్రాల కోసం.. నెలలో ఓ పది రోజుల పాటు హైద్రాబాద్ లోనే ఉండాల్సి వస్తోంది. అందుకే హోటల్ లో ఉండే బదులు.. ఇక్కడ సొంతిల్లు తీసుకుందామని అనుకుంటున్నా. నా ఆలోచనకు నా భార్య - పిల్లలు కూడా సంతోషించారు. హోటల్ బిల్స్ తో నిర్మాతలపై ప్రెజర్ పెట్టేబదులు.. నేనే ఓ ఇల్లు ఏర్పాటు చేసుకుందామని అనుకుంటున్నా' అని చెప్పాడు అభిమన్యు సింగ్.

ఇలా సొంతిల్లు కొనుక్కోవాలనే ఆలోచన రావడానికి హైద్రాబాద్ జనాలే కారణమట. ఇక్కడ ఫుడ్ - నేటివిటీ నచ్చినా మూడేళ్ల క్రితం జరిగిన ఓ సంఘటన.. హైద్రాబాద్ పై మనసుపారేసుకునే చేసిందట. ఓ మూవీ కోసం చార్మినార్ ప్రాంతంలో షూటింగ్ లో ఉండగా.. ఓ అభిమాని వచ్చి వాళ్లింటికి ఆహ్వానించాడట. అతను అడిగిన విధానం నచ్చడంతో వెళ్లగా.. తనకి ఓ రాజకుమారుడి రేంజ్ లో ట్రీట్మెంట్ ఇవ్వడం చూసి ఆశ్చర్యపోయాడట. హైద్రాబాద్ జనాలు ఇలాంటివారా? ఇంతగా ప్రేమిస్తారా అనుకున్నాడట అభిమన్యు సింగ్. అందుకే ఇక్కడ సొంతిల్లు ఏర్పాటు చేసుకుంటున్నట్లు చెప్పాడు సిద్ధప్ప నాయుడు.