ఫస్ట్ లుక్ః ఇద్దరూ ఆటగాళ్లే

Wed Oct 11 2017 11:36:42 GMT+0530 (IST)

టాలీవుడ్ లో హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా కాస్త డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలను చేస్తున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది ఖచ్చితంగా నారా రోహిత్ అనే చెప్పాలి. మనోడు ఎంచుకునే క్యారక్టర్లు కంటెంట్లు కొత్తగానే ఉంటాయి. ఇప్పుడు అదే తరహాలో మరో కొత్త సినిమాతో వస్తున్నాడు. గతంలో ఆంధ్రుడు అధినాయకుడు వంటి సినిమాలను తీసిన సీనియర్ డైరక్టర్ పరుచూరి మురళి డైరక్షన్లో ''ఆటగాళ్ళు'' అనే సినిమాతో దూసుకొస్తున్నాడు.చూస్తుంటే ఒక హీరో అండ్ విలన్ మధ్యన జరిగే ఆధిపత్య పోరుకు సంబంధించిన కాన్సెప్టుతో ఈ ఆటగాళ్ళు సినిమా రూపొందిస్తున్నట్లు అనిపిస్తోంది. ఫస్ట్ లుక్ చూస్తే అదే విషయం మనం కన్ఫామ్ చేసుకోవచ్చు. పైగా ఇందులో ఒక ప్రక్కన మెథడ్ యాక్టర్ నారా రోహిత్ ఉంటే.. మరో ప్రక్కిన అలనాటి మేటి దిగ్గజం జగపతి బాబు ఉన్నాడు. ఈ మధ్యన తన విలనిజాన్ని కాస్త తగ్గించుకున్న జగపతి బాబు.. ఇప్పుడు మరోసారి పూర్తి స్థాయి విలనిజం ఈ సినిమాలో చూపించబోతున్నాడట. మొత్తానికి చాలా గ్యాప్ తీసుకుని వస్తున్న పరుచూరి మురళి.. మంచి కాంబినేషన్ తోనే ముందు ఆసక్తిని క్రియేట్ చేశాడు.

ఇకపోతే ప్రస్తుతం నారా రోహిత్ బాలకృష్ణుడు.. మరియు వీరభోగ వసంతరాయలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే అవి రిలీజ్ కాబోతున్నాయి. అది సంగతి.