Begin typing your search above and press return to search.

స‌త్య‌మేవ జ‌య‌తే ఎవ‌రు చూస్తారిక‌?

By:  Tupaki Desk   |   26 Nov 2015 6:15 AM GMT
స‌త్య‌మేవ జ‌య‌తే ఎవ‌రు చూస్తారిక‌?
X
మిస్ట‌ర్ పెర్‌ ఫెక్ట్ అమీర్‌ ఖాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు ఫ్యాన్స్‌ తో పాటు యావత్ భార‌త‌దేశ పౌరుడిని హ‌ర్ట్ చేశాయి. సామాజిక వెబ్ సైట్ల‌లో అత‌డిపై ఆల్ మోస్ట్ వార్ న‌డిపించారు కొంద‌రైతే. అమీర్ దేశం విడిచి వెళ్లిపోవాల్సిన టైమ్ వ‌చ్చింది అంటూ అత‌డిని సూటిగా టార్గెట్ చేశారు. అంతేకాదు అత‌డు బ్రాండ్ ప‌బ్లిసిటీ చేస్తున్న కోలా ఉత్ప‌త్తుల్ని ఇక వినియోగించ‌మ‌ని క్లారిటీ ఇచ్చేశారు. మ‌రో వైపు అమీర్‌ నే న‌మ్ముకుని బ్రాండ్ ప‌బ్లిసిటీ చేసుకుంటున్నా ఆన్‌ లైన్ పోర్ట‌ల్ స్నాప్‌ డీల్‌ కి పెద్ద రేంజులో ఝ‌ల‌క్ త‌గిలింది. ల‌క్ష‌లాది మంది మొబైల్ ఫోన్స్ నుంచి ఈ యాప్‌ ని డిలీట్ చేసేయ‌డంతో ఆన్‌ లైన్ డీల్స్ స్థంబించిపోయాయ‌ని తెలుస్తోంది. అయితే ఈ యుద్ధం ఇక్క‌డితో ఆగేట్టే లేదు.

ప్ర‌స్తుతం ఆ ఎఫెక్ట్ అమీర్ హోస్ట్‌ గా న‌డిపిస్తున్న స‌త్య‌మేవ జ‌య‌తే పైనా ప‌డింద‌ని చెబుతున్నారు. ఈ రియాలిటీ షో మునుప‌టిలా పెద్ద రేంజులో స‌క్సెస‌య్యే ప‌రిస్థితే లేద‌ని చెబుతున్నారు. ఇంత‌కాలం స‌త్య‌మేవ జ‌య‌తే అంటూ ఓ బ్రాండ్‌. అత‌డు ఎన్నో నిజాల్ని ఎంతో నిర్భీతిగా బైటి ప్ర‌పంచానికి ఆవిష్క‌రించిన తీరును అంత తేలిగ్గా మ‌ర్చిపోలేం. దేశంలోనే అంత‌టి ప్ర‌జాదార‌ణ పొందిన వేరొక రియాలిటీ షో లేనేలేదు. అమీర్ మాట‌ల్లో సూటిత‌నం, నిజాయితీ భార‌త‌దేశ ప్ర‌జ‌ల‌కు న‌చ్చింది. అందుకే అంత ఆద‌ర‌ణ ద‌క్కింది.

కానీ ఉన్న‌ట్టుండి.. ఈ దేశంలో బ‌త‌క‌లేం. దేశాన్ని వీడి నేను, నా భార్య వెళ్లిపోవాల‌నుకుంటున్నాం .. అన్న ఒకే ఒక్క వ్యాఖ్య‌తో అభిమానుల్లో ఏహ్య‌భావం పెరిగింది. ఇది మామూలు కామెంట్ కాదు.. ఇక‌మీద‌ట అత‌డి లైఫ్‌ స్ట‌యిల్ మొత్తాన్ని ప్ర‌భావితం చేసే విధంగా ఉంటుంద‌ని అంచ‌నాలేస్తున్నారు. కార్పొరెట్ వ‌ర‌ల్డ్‌ తో అత‌డి స‌త్సంబంధాలు చెడిపోయే ప్ర‌మాదం ఉంద‌ని, వాణిజ్య ప్ర‌క‌ట‌న‌తో వ‌చ్చే ఆదాయం ప‌డిపోతుంద‌ని విశ్లేషిస్తున్నారు కొంద‌రు. దిస్ ఈజ్ టూ బ్యాడ్ అమీర్?