అమీర్ మళ్లీ షాక్ ఇచ్చాడుగా..

Thu May 18 2017 16:43:48 GMT+0530 (IST)

సినిమాలతో సక్సెస్ లు.. భారీ సక్సెస్ లు.. ఇండస్ట్రీ రికార్డులు సృష్టించడం తిరగరాయడం మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కు అలవాటే. అలాగే రకరకాల కేరక్టర్స్ తో కూడా షాక్ ఇచ్చేస్తూ ఉంటాడు. పీకే లో దాదాపు న్యూడ్ గా కనిపించినా.. దంగల్ కోసం విపరీతంగా బాడీలో మార్పులు చూపించినా అన్నీ ఆమిర్ ఖాన్ కే చెల్లాయి.

ఇప్పుడు థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ అంటూ కొత్త సినిమా చేస్తున్నాడు ఆమిర్. ఈ మూవీ కోసం మరో షాక్ ఇచ్చేయబోతున్నాడు. ఆమిర్ ఖాన్ లేటెస్ట్ ఫోటోలు చూసిన వారికి షాక్ కొట్టేసింది. ఏకంగా ముక్కుపుడకతో దర్శనం ఇచ్చాడు ఈ స్టార్ హీరో. స్టార్స్ సంగతి పక్కన పెడితే.. అసలు ఇవాల్టి కాలంలో ముక్కు కుట్టించుకునేవారు ఎవరూ కనిపించడం లేదు. అమ్మాయిలే ఇందుకు దూరంగా ఉంటున్న సమయంలో ఏకంగా ఆమిర్ లాంటి స్టార్ ఈ పని చేసేయడం.. అది కూడా ఒక సినిమా కోసం కావడం మరీ ఆశ్చర్యకరం.

థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ మూవీలో దంగల్ ఫేం ఫాతిమా సనా ఖాన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. కత్రినా కైఫ్ కూడా నటిస్తోంది. థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ చిత్రానికి అమితాబ్ బచ్చన్ పాత్ర ప్రధాన ఆకర్షణ కానుండగా.. ఇప్పుడు ముక్కు పుడకతో కనిపించి మరింత ఆసక్తి పెంచాడు ఆమిర్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/