అమీరా అలా.. మహేష్ బాబు ఇలా..

Mon Sep 25 2017 06:00:01 GMT+0530 (IST)

స్టార్ హీరోలు తెరపై సిగరెట్ తాగుతూ.. మందు కొడుతూ కనిపిస్తే ఆ ప్రభావం సినిమాలు చూసే వారిపై పడే అవకాశం ఉండదా? ఇదొక ప్రశ్నలేని ఆన్సర్. ఎందుకంటే.. సిగరెట్లూ మందూ చూసి ప్రేరణ పొందే జనాలు.. మంచి మాటలను చూసి కూడా పొందాలి. కాని వాటిని చూసి ఎవ్వరూ ఇ న్ స్పయిర్ అవ్వట్లేదు. అందుకే ఇలాంటి అంశాలపై అమీర్ ఖాన్ ఒక తరహాలో స్పందిస్తే.. మహేష్ బాబు మరో తరహాలో స్పందించారు.అసలు సినిమాల్లో మందు సిగరెట్లు సీన్లు వచ్చేటప్పుడు.. అక్కడ స్ర్కీన్ పై 'నో స్మోకింగ్ డ్రింకింగ్' అంటూ కామెంట్ వేయడం కామెడీగా ఉందని కామెంట్ చేశాడు అమీర్ ఖాన్. అంతేకాదు.. అసలు అలా తెరపై కామెంట్ వేసినా వేయకపోయినా సిగరెట్లు కాల్చేవారు కాలుస్తూనే ఉంటారని చెప్పాడు. అమీర్ ఖాన్ ఒక చైన్ స్మోకర్ అనే సంగతి మనకు తెలిసిందే. ఈ మధ్యనే మానేశాను అని కూడా చెప్పాడులే.

ఇక మహేష్ బాబు విషయానికొస్తే.. ''ఆడియన్స్ ఎదుగుతున్నారు. వాళ్లంత మూర్ఖులు కాదు. ‘స్పైడర్’లో మాత్రం మద్యపానం - ధూమపానానికి సంబంధించిన సన్నివేశాలు ఒక్కటీ లేవు. తెరపై ఒక సీన్ జరుగుతున్నప్పుడు కింద కామెంట్ వేస్తే.. ఆ సీన్ తాలూకు ఇంపాక్ట్ తగ్గుతుందని నా ఫీలింగ్'' అంటూ కామెంట్ చేశాడు. చూస్తుంటే మహేష్ కూడా అమీర్ తరహాలోనే చెప్పాడనే అనుకోవాలి. కాకపోతే ఈయన సినిమా తరుపునుండి మాట్లాడాడు.