Begin typing your search above and press return to search.

ఆ స్టార్ ను చూసి అందరూ నేర్చుకోవాలి

By:  Tupaki Desk   |   12 Oct 2017 10:01 AM GMT
ఆ స్టార్ ను చూసి అందరూ నేర్చుకోవాలి
X
బాలీవుడ్.. టాలీవుడ్.. కోలీవుడ్ అని తేడా లేకుండా అన్ని చోట్లా స్టార్ హీరోలది ఒకటే బాట. సినిమా సినిమాకూ పారితోషకం పెంచేయడం.. ముందు అడ్వాన్స్ చేతికొచ్చాకే సినిమా చేయడం.. సినిమా పూర్తయ్యేలోపు పూర్తి పారితోషకం ముక్కుపిండి వసూలు చేయడం. ఐతే హీరోల పారితోషకం ఇలా అంతకంతకూ పెరిగిపోతుండటంతో బడ్జెట్ కూడా ఆమేరకు పెరిగిపోతోంది. అన్ని రెమ్యూనరేషన్లూ కలిపితే బడ్జెట్లో 70 శాతం దాటిపోతోంది. ఇక సినిమాకు ఖర్చు పెడుతున్నది చాలా తక్కువ. పారితోషకాలు పెరగడం వల్ల బడ్జెట్లు పెరిగి.. దానికి తగ్గట్లే బిజినెస్ చేసి.. చివరికి సినిమాకు నెగెటివ్ టాక్ రాగానే దారుణమైన నష్టాలొస్తున్నాయి. సినిమాలు డిజాస్టర్లుగా మిగులుతున్నాయి.

ఐతే మిగతా స్టార్లందరి మధ్య అమీర్ ఖాన్ భిన్నంగా కనిపిస్తాడు. అతను సినిమా మొదలయ్యేటపుడు కానీ.. పూర్తయ్యాక కానీ పైసా పారితోషకం తీసుకోడట. అతను సినిమా ద్వారా వచ్చే లాభాల నుంచి మాత్రమే వాటా తీసుకుంటాడట. ఈ విషయమై అమీర్ స్పందిస్తూ.. ‘‘నేను పాత సంప్రదాయాన్ని పాటిస్తా. సినిమా అనేది కళ. ఆ కళను మనం ప్రదర్శిస్తే జనాలకు నచ్చితే డబ్బులిస్తారు. లేదంటే ఇవ్వరు. జనాలకు నచ్చని సినిమా తీస్తే నాకు పైసా ముట్టదు. నేను సినిమా మొదలయ్యే ముందు డబ్బులేమీ తీసుకోను. నా సినిమా ఆడలేదంటే అందరికంటే ఎక్కువ నష్టపోయేది నేనే. మిగతా ఆర్టిస్టులు.. టెక్నీషియన్లు.. దర్శక నిర్మాతలు.. అందరికీ డబ్బులందాక చివరగా నేను పారితషకం తీసుకుంటా. కానీ అదృష్టవశాత్తూ నా సినిమాలన్నీ మంచి లాభాలందిస్తున్నాయి’’ అని అమీర్ చెప్పాడు. ఐతే గత దశాబ్ద కాలంలో అమీర్ పట్టిందల్లా బంగారమే. 3 ఇడియట్స్.. ధూమ్-3.. పీకే.. దంగల్.. ఇలా అమీర్ చేసిన ప్రతి సినిమా అద్భుతమే. అవన్నీ భారీగా లాభాలందించాయి. లాభాల్లో అమీర్ 60-70 శాతం దాకా వాటా తీసుకుంటున్నాడట. ‘దంగల్’కు ఈ లెక్కన రూ.300 కోట్ల దాకా అమీర్ అందుకుున్నట్లు అంచనా. అమీర్ చెబుతున్న ఈ మోడల్ అందరు స్టార్లో ఫాలో అయితే బాగుంటుంది కదా.