అమీర్ వదిలేసింది షారుఖ్ చేస్తున్నాడు

Tue Mar 13 2018 13:21:55 GMT+0530 (IST)

ఒకప్పుడు బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ తర్వాతే ఎవరైనా. అతడి ఫాలోయింగ్.. మార్కెట్ అంతా వేరుగా ఉండేది. అమీర్ ఖాన్ అతడి ముందు చిన్న హీరోలా కనిపించేవాడు. కానీ తర్వాత తర్వాత కథ మారుతూ వచ్చింది. షారుఖ్ అర్థరహితమైన కమర్షియల్ సినిమాల్లో కొట్టు మిట్టాడుతూ ఉంటే.. అమీర్ కథా బలం ఉన్న విభిన్నమైన సినిమాలు చేస్తూ ఇంతింతై అన్నట్లుగా ఎదిగిపోయాడు. ఇప్పుడు అతడిని మరో హీరో అందుకోలేని స్థాయిలో ఉన్నాడు. ఇప్పుడు మిగతా హీరోలు కూడా అతడిని అనుసరిస్తూ వైవిధ్యమైన సినిమాల వైపు అడుగులేస్తున్నారు. కొంచెం లేటుగా మేల్కొన్న షారుఖ్ సైతం ఇప్పుడు కొత్త కథలు ట్రై చేస్తున్నాడు. అతను మరగుజ్జు పాత్రలో ‘జీరో’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా షారుఖ్ ఒక బయోపిక్ చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. తొలిసారి చంద్రుడిపై అడుగుపెట్టిన భారత వ్యోమగామిగా చరిత్ర సృష్టించిన రాకేశ్ శర్మ జీవిత కథతో తెరకెక్కబోయే సినిమాలో షారుఖ్ నటించబోతున్నాడట. ఈ చిత్రం కోసం త్వరలోనే షారుఖ్ కసరత్తులు మొదలుపెట్టబోతున్నాడు. ఈ చిత్రం ‘సెల్యూట్’ పేరుతో తెరకెక్కనుంది. నిజానికి ఈ చిత్రం అమీర్ ఖాన్ చేయాల్సింది. ఐతే ప్రస్తుతం ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’లో నటిస్తున్న అమీర్ దీని తర్వాత ‘మహాహారతం’ ఆధారంగా సినిమా చేయాలని.. దాని మీద వర్క్ చేయాలని నిర్ణయించుకోవడంతో రాకేశ్ శర్మ బయోపిక్ నుంచి తప్పుకున్నాడు. అమీర్ వదిలేసిన సినిమా అని ఇగోకు పోకుండా ఈ చిత్రం చేయడానికి షారుఖ్ ముందుకు రావడం విశేషమే.