Begin typing your search above and press return to search.

సూపర్ పోజులిస్తున్న స్టార్ కిడ్

By:  Tupaki Desk   |   20 Sep 2019 8:33 AM GMT
సూపర్ పోజులిస్తున్న స్టార్ కిడ్
X
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కు ఓ ముద్దుల కూతురు ఉందని తెలిసిందే. ఖాన్ సాబ్ డాటర్ పేరు ఇరా. ఇతర స్టార్ కిడ్స్ తరహాలోనే ఇరా కూడా ఈమధ్య సోషల్ మీడియాను వేడెక్కిస్తోంది. పచ్చబొట్లు పొడిపించుకోవడం.. ఆ ఫోటోలను షేర్ చేయడమే కాదు.. మిశాల్ కృపలాని అనే కుర్రాడు తన బాయ్ ఫ్రెండ్ అని సగర్వంగా ప్రకటించి..మిశాల్ ను హగ్ చేసుకుంటున్న ఫోటోలను కూడా షేర్ చేసి అందరికీ చిన్నపాటి ఝలక్ ఇచ్చింది.

సినిమాల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందా లేదా అనే విషయంలో ఇంకా క్లారిటీ అయితే లేదు కానీ ఇరా మాత్రం బాలీవుడ్ లో క్రేజీ స్టార్ కిడ్ గా మారింది. దీంతో ఇరా ఎక్కడ కనిపించినా ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పని చెప్పేస్తున్నారు. ఇరా కూడా ఫోటోగ్రాఫర్లు ఫోటో తీసే సమయంలో మొహానికి చేతులు అడ్డుపెట్టుకోవడం.. మా ప్రైవసీని మీరు పాడు చేస్తున్నారన్నట్టుగా చిరాకు ఫేస్ పెట్టడం కాకుండా నవ్వుతూ పోజిస్తోంది. రీసెంట్ గా ముంబైలో ఒక చోట ఇరా కనిపించింది. దీంతో ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీసేందుకు రెడీ అయితే వారికి ఓపిగ్గా చిరునవ్వులు చిందిస్తూ పోజులు ఇచ్చింది.

బ్లూ కలర్ షార్ట్ గౌన్.. భుజానికి ఒక బ్యాగ్ తో ఇరా ఖాన్ చాలా సింపుల్ గా కనిపించింది. చేతికి వాచ్ తప్ప మరే ఇతర యాక్సెసరీస్ ధరించలేదు. చెప్పులు కూడా చాలా సింపుల్ గా ఉన్నాయి. అయితే సింపుల్ గా ఉన్నా బ్యూటిఫుల్ గా కనిపిస్తోంది. ఇరా వాలకం.. ఫోటోలకు ఓపికగా పోజులివ్వడం చూస్తుంటే.. త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టే ఉంది.