Begin typing your search above and press return to search.

బ్లాక్ బ‌స్ట‌ర్ ట్రైల‌ర్.. స‌మ‌య‌మాస‌న్న‌మాయె

By:  Tupaki Desk   |   19 Oct 2016 4:43 AM GMT
బ్లాక్ బ‌స్ట‌ర్ ట్రైల‌ర్.. స‌మ‌య‌మాస‌న్న‌మాయె
X
ఒక సినిమా విడుద‌ల కావ‌డానికి రెండు నెల‌ల ముందే.. దాని ర‌షెస్ చూసిన ఒక ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు తాను గ‌త ద‌శాబ్ద కాలంలో చూసిన అత్యుత్తమ సినిమా ఇదే అని తీర్పు ఇచ్చేయ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌యం. ఆ ద‌ర్శ‌కుడు క‌ర‌ణ్ జోహార్ అయితే.. ఆయ‌న చూసిన సినిమా ‘దంగ‌ల్‌’. మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ష‌నిస్ట్ అమీర్ ఖాన్ కొత్త సినిమా ఇది. క‌ర‌ణ్ మాత్ర‌మే కాదు.. ష‌బానా ఆజ్మీ లాంటి మ‌రికొంద‌రు బాలీవుడ్ సెల‌బ్రెటీలు కూడా ‘దంగ‌ల్’ సినిమాను ముందే చూసి వావ్ అనేశారు. నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్ విన‌య్ శుక్లా అయితే ‘3 ఇడియ‌ట్స్’.. ‘పీకే’ క‌న్నా దంగ‌లే గొప్ప సినిమా అన్నాడు.

మామూలుగానే అమీర్ సినిమాల‌పై అంచ‌నాలు భారీగా ఉంటాయి. దీనికి తోడు ఈ వ్యాఖ్య‌ల‌తో ‘దంగ‌ల్‌’పై అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల‌కు రెండు నెలల ముందే వ‌చ్చేస్తుండ‌టం విశేషం. గురువారం నాడే ‘దంగ‌ల్’ ట్రైల‌ర్ లాంచ్ చేస్తున్నారు. ఇప్ప‌ట్నుంచే సోష‌ల్ మీడియాలో దీని సందడి మొద‌లైపోయింది. అభిమానులు దీనిపై ట్వీట్లు గుప్పిస్తూ హైప్ పెంచేస్తున్నారు. మ‌రి ఆ ట్రైల‌ర్ ఎలా ఉంటుందో చూడాలి. అంకిత్ తివారి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో అమీర్ న‌లుగురు అమ్మాయిల తండ్రిగా న‌టిస్తున్నాడు. మ‌హ‌వీర్ పొగ‌ట్ అనే రెజ్ల‌ర్ జీవిత క‌థ ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. డిసెంబ‌రు 23న ‘దంగ‌ల్’ ప్రేక్ష‌కుల ముందుకొస్తుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/