తన రికార్డు తానే ‘పీకే’శాడు

Tue Jan 10 2017 13:37:56 GMT+0530 (IST)

బాలీవుడ్ సీనియర్ హీరోలకు ఏజ్ పెరుగుతున్న కొద్దీ క్రేజ్ మరింత పెరుగుతున్నట్లుగా ఉంది. వారి సినిమాలకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. తాజాగా ఇండియాలో తొలిసారి రూ.350 కోట్ల కలెక్షన్ తో అమీర్ ఖాన్ రికార్డు సృష్టించేశాడు.  ఇంతకుముందు ఆయనే నటించిన పీకే సినిమాకు ఉన్న హయ్యెస్ట్ కలెక్షన్ల రికార్డును తాజా చిత్రంతో బద్దలు కొట్టేశాడు.
    
బాలీవుడ్ మిస్టర్ పెర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన దంగల్ కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. దేశ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన ‘పీకే’ రికార్డును దంగల్‌తో అధిగమించి మరో అరుదైన రికార్డును అమీర్ ఖాతాలో వేసుకున్నాడు. 16 రోజుల తర్వాత రూ.350 కోట్ల వసూళ్లను రాబట్టింది దంగల్. రూ.350 కోట్ల కలెక్షన్లతో అమీర్ ఖాన్ తన పీకే (రూ.340 కోట్లు)సినిమా పేరుతో ఉన్న రికార్డును తానే అధిగమించి తాజా రికార్డును సృష్టించాడు.
    
గతంలో 100కోట్ల క్లబ్ లోకి చేరిన మొదటి మూవీగా గజినీ - 200కోట్ల క్లబ్ లో చేరిన మొదటి సినిమాగా త్రీఇడియట్స్ - 300కోట్ల క్లబ్ లోకి చేరిన మొదటి సినిమాగా పీకే ఉన్నాయి. తాజాగా అమీర్ ఖాన్ దంగల్ 350కోట్ల కలెక్షన్లను రాబట్టిన మొదటి భారతీయ చిత్రంగా రికార్డును కైవసం చేసుకుంది. ఇక విదేశాలలో ఈ మూవీ ఇప్పటి వరకూ రూ 180 కోట్ల వసూళ్లను సాదించింది.. ఓవరాల్ గా రూ 530 కోట్లు ఇప్పటివరకు వసూలు చేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/