Begin typing your search above and press return to search.

ఆ సెక్సీ పిల్ల.. అలా షాకిచ్చింది

By:  Tupaki Desk   |   20 Nov 2017 6:45 AM GMT
ఆ సెక్సీ పిల్ల.. అలా షాకిచ్చింది
X
నటించడంలోనే తారలు ఎక్కువ అభిమానులను సంపాదించుకోరని కొందరిని చూస్తే మనకే ఈజీగా అర్ధమవుతోంది. నటన ఎక్కువగా రాకపోయినా సాదాసీదాగా స్టెప్పులు వేసే తారలు కూడా వారి మంచి తనంతో నాలుగు మంచి కార్యక్రమాల్లో పాల్గొంటూ వారికంటూ కొందరి అభిమానులను సంపాదించుకుంటున్నారు. అంతే కాకుండా కొంచెం మనఃశాంతిని కూడా పొందుతున్నారు.

సినిమాల పరంగా ఒక్కోసారి విమర్శలు తెచ్చుకున్నా కూడా వ్యక్తిగతంగా మంచి ఆదరణను అందుకుంటున్నారు. అయితే అదే తరహాలో ఇప్పుడు బాలీవుడ్ లో త్వరలో హీరోయిన్ గా డెబ్యూ చేయబోతున్న ఆలియా ఇబ్రహీం. సోషల్ మీడియాలో తన హాట్ అందాలతో లో దుస్తులతో దర్శనం ఇచ్చే ఈ సుందరి.. నటి పూజా బేడి కూతురు అని అందరికి తెలిసిందే. సోషల్ మీడియాలో అమ్మడికి ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు. ఎప్పుడు ఏ హాట్ ఫొటో పెడుతుందా అని చాలా ఆశగా ఎదురుచూస్తుంటారు. కానీ రీసెంట్ గా ఆలియా ఎవరు ఊహించని విధంగా ఒక ఫొటో పోస్ట్ చేసి ఆశ్చర్యపరిచింది.

ఒక స్కూల్లో పిల్లలకు ఆర్ట్ నేర్పడానికి ఇలా సాదాసీదాగా వెళ్ళింది. వారికి ప్రతి శనివారం క్లాసెస్ చెబుతున్నందుకు చాలా ఆనందపడుతున్నాని చెప్పింది. దీంతో అభిమానులు ఎపుడు ఫ్యాషన్ దుస్తుల్లో కనిపించే ఈ హాట్ బ్యూటీ ఇలా దర్శనం ఇచ్చిందేంటని చాలా పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. అమ్మడి తీరును బట్టి చూస్తుంటే.. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో బాగా తెలుసు అనిపిస్తోంది కదా. ఈ సెక్సీ పిల్ల ఇచ్చిన ఈ లుక్స్ షాక్ నుండి ఇంకా చాలామంది తేరుకోలేదు తెలుసా!!