భాగమతి లో అవే హైలెట్

Wed Jan 17 2018 23:02:35 GMT+0530 (IST)

2018 లో అసలైన మొదటి బాక్స్ ఆఫీస్ హిట్టు ఇంకా పడలేదు. స్టార్ హీరోలు భారీ అంచనాలతో వచ్చినా ఫైనల్ గా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టేశారు. ఇక చిన్న హీరోలు కూడా దాదాపు అంతే. అయితే మొన్నటి వరకు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అనేలా సిద్ధమవుతోంది అనుష్క భాగమతి. అరుంధతి టైమ్ లో అమ్మడు ఎటువంటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు అదే తరహాలో మరోసారి అందరి చూపును తనవైపు తిప్పుకుంటోంది.ప్రముఖ యూవీ క్రియేషన్స్ మొన్నటి వరకు నిర్మించిన సినిమాల కంటే ఈ సినిమా చాలా స్పెషల్ అని చెప్పాలి. అలాగే కమర్షియల్ దర్శకుడు జి.అశోక్ కూడా కొత్త తరహాలో డైరెక్ట్ చేసిన ఈ సినిమా విజువల్ వండర్ గా ఉండనుందట. అయితే సినిమాలో ట్విస్టులు కూడా ఆ రేంజ్ లో ఉంటాయట. ఇప్పటికే ట్రైలర్ వ్యూస్ రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. రిలీజ్ కు ఇంకా టైమ్ బాగానే ఉన్నా కూడా సినిమా సందడి కొనసాగుతోంది. ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేశారు. ఇకపోతే సినిమా ట్రైలర్ లో కొన్ని పాత్రలను మాత్రమే చూపించారు.

ఉన్ని ముకుందన్ పాత్రను అలాగే అనుష్క సాఫ్ట్ క్యారెక్టర్ ని ఎక్కువగా ఫోకస్ చేశారు. కానీ అసలైన పాత్రలను వెండితెరపై చూపించాలని ట్రైలర్ ను చాలా జాగ్రత్తగా కట్ చేశారు. ముఖ్యంగా ఆది పినిశెట్టి పాత్ర ఇందులో కీలకం కానుందట. ఇందులోను ఆది విలన్ పాత్ర చేస్తున్నాడట . ఫ్లాష్ బ్యాక్ లో అతని  పెర్ఫార్మెన్స్  చాలా బావుంటుందని చిత్ర యూనిట్ ద్వారా తెలిసింది. అనుష్క అసలైన భాగమతి క్యారెక్టర్ కూడా సెకండ్ హాఫ్ లో హైలెట్ గా నిలవనుందట. సినిమాను మరొస్థాయికి తీసుకువెళ్లడం కాయమని టాక్. మరి ప్రేక్షకులకు ఈ సినిమా ఎంతవరకు నచ్చుతుందో చూడాలి.