ఇప్పుడైనా హీరోగా సెటిల్ అవుతాడా?

Thu May 24 2018 23:00:01 GMT+0530 (IST)

కథానాయకుడిగా సక్సెస్ అవ్వాలంటే ఈ రోజుల్లో ఎంతగా కష్టపడాలో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఏళ్ల నుంచి కష్టపడి చాలా మంది లేట్ గా హీరోలయ్యారు. ముందు నటుడిగా వారికంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకొని హీరోగా సక్సెస్ అయినా వారు ప్రతి ఇండస్ట్రీలో కనిపిస్తారు. ఇక హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరీన నటుల్లో ఆది పినిశెట్టి ఒకరు. ఈ యువ హీరో ఈ మధ్య కాలంలో నటుడిగా మంచి క్రేజ్ అందుకున్నాడు. వివిధ పాత్రల్లో కనిపించి ఆల్ రౌండర్ అనిపించుకున్నాడు.సరైనోడు - అజ్ఞాతవాసి అలాగే సమ్మర్ బాక్స్ ఆఫీస్ హిట్ రంగస్థలం సినిమాలో కనిపించి ఎంతగానో ఆకట్టుకున్నాడు. విలన్ గా ప్రత్యేక పాత్రలు ఎక్కువయ్యాయి అనుకున్నాడో ఏమో మరి మళ్లీ తన పాత కోరికలపై కన్నేశాడు. హీరోగా సక్సెస్ కొట్టడానికే ఇదే సరైన సమయమని నీవెవరో అనే సినిమా ద్వారా రాబోతున్నాడు. కోన వెంకట్ సమర్పణలో హరినాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను రెగ్యులర్ గా కాకుండా డిఫెరెంట్ స్టైల్ లో తెరకెక్కిస్తున్నారు. అది పినిశెట్టి సరసన తాప్సి హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మరో ముఖ్యమైన లేడి క్యారెక్టర్ కోసం రితిక సింగ్ ను ఎంచుకున్నారు.

మొన్నటి వరకు సపోర్టింగ్ క్యారెక్టర్స్ తో మెప్పించిన ఆది పినిశెట్టి ఇప్పుడు లీడ్ క్యారెక్టర్ వస్తున్నాడు అంటే ఎంతో కొంత కెరీర్ కు ఉపయోగమే. సినిమా మంచి టాక్ ను అందుకుంటే హీరోగా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఆ తరహాలో ఆది హిట్ అందుకుంటాడో లేదో చూడాలి. నీవెవరో సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.