Begin typing your search above and press return to search.

ఆ కష్టం ఏంటో తెలిసింది-ఆది

By:  Tupaki Desk   |   11 Feb 2016 10:30 PM GMT
ఆ కష్టం ఏంటో తెలిసింది-ఆది
X
డైలాగ్ కింగ్ సాయి కుమార్ తనయునిగా తెరంగేట్రం చేసిన ఆది... ప్రేమకావాలి - లవ్ లీ సినిమాలతో బాగానే పేరు తెచ్చుకున్నాడు. ఆ తరువాత వచ్చిన సినిమాలన్నీ నిరాశ పరిచాయి. సంపత్ నంది నిర్మాతగా మారి ‘గాలిపటం’ సినిమా తీసినా... వర్కవుట్ కాలేదు. సుకుమారుడు, ప్యార్ మే పడిపోయానే, రఫ్ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయాయి. ఈ సారి సాయికుమార్ నిర్మాతగా మారి తన కొడుకును హీరోగాపెట్టి మదన్ డైరెక్షన్ లో ‘గరం’ సినిమా నిర్మించాడు. ఇందులో ఆదాశర్మ హీరోయిన్. ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ ‘ప్రేమకావాలి - లవ్ లీ సినిమాలు చేస్తున్నప్పుడు నాకు అంత మెచ్యురిటీ లేదు. ఏదో సినిమాలు చేస్తున్నాం అంతే అనుకునేవాణ్ని. పెళ్లయిన తరువాత నా బాధ్యత ఏంటో తెలిసింది. ఇంకా చెప్పాలంటే.. గరం సినిమాను సొంత బ్యానర్లో చేశాం కాబట్టి.. సినిమా నిర్మాణం పట్ల మరింత బాధ్యత తెలిసింది. వేరే నిర్మాతల సినిమాల్లో నటించేటప్పుడు ఏం అంత కష్టం కనిపించేది కాదు. కానీ సొంత బ్యానర్లో చేస్తుంటే... నిర్మాత కష్టాలేంటో తెలిసింది. ఇక నుంచి వేరే నిర్మాతల సినిమాల్లో నటించేటప్పుడు మరింత బాధ్యతతో నటిస్తా. ఎందుకంటే.. గరం సినిమాను సొంత బ్యానర్లో నిర్మించడం వల్ల నిర్మాతల కష్టాలేంటో తెలిసొచ్చింది. నాకు తెలిసి హీరోలంతా.. ఒక్కసారైనా సొంత బ్యానర్లో సినిమా చేయాలి. అప్పుడే నిర్మాతల కష్టాలేంటో తెలుస్తాయి’ అన్నాడు.

ఇక సినిమా గురంచి మాట్లాడుతూ ‘మదన్ మంచి రచయిత. అతనికి మంచి విజన్ వుంది. నన్ను అన్ని విధాలా ఎలా చూపించాలో అలా చూపించాడు. ఈ సినిమాలో డ్యాన్స్, ఫైట్లతో పాటు మంచి స్టోరీ కూడా వుంది. తప్పకుండా హిట్ కొడతాం. నాన్న గారు హీరోగా మారిన ‘పోలీస్ స్టోరీ’ సినిమాకు థ్రిల్లర్ మంచు దర్శకత్వం వహించాడు. ఇప్పుడు ఆయనే ఈ సినిమాలో నాకు యాక్షన్ ఎపిసోడ్స్ కంపోజ్ చేశారు. అలాగే సత్య ప్రకాష్ కూడా పోలీస్ స్టోరీలో విలన్. ఆ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే. సో.. ఇందులోనూ ఆయన నటించారు. సో... కచ్చితంగా ఈ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని నమ్ముతున్నా. నేను సిక్స్ ప్యాక్ చేసినప్పుడు నా గ్లామర్ అంతా దెబ్బతింది. దాంతో సిక్స్ ప్యాక్ మానేశా. ప్రస్తుతం చుట్టాలబ్బాయ్ చేస్తున్నా. మొన్ననే బ్యాంకాక్ లో ఓ పాట షూట్ చేశాం. నలభై శాతం పూర్తయిందని’ చెప్పారు.