Begin typing your search above and press return to search.

చెర్రీతో హిప్ హాప్ ఆడించేస్తారా?

By:  Tupaki Desk   |   1 Dec 2015 5:30 PM GMT
చెర్రీతో హిప్ హాప్ ఆడించేస్తారా?
X
హిప్ హాప్ తమీజా.. ఒకప్పుడు రాజ్ కోటి ఎలా సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషనో.. ఇప్పుడు కోలీవుడ్ లో ఓ ఇద్దరు అలానే సంచలనం సృష్టిస్తున్నారు. వాళ్లే ఆదిత్య రామచంద్రన్ - జీవాలు. వీళ్లిద్దరు విడివిడిగానే మ్యూజిక్ డైరెక్టర్స్ అయినా.. ఓ ఆల్బం వీళ్లిద్దరినీ కలిపి సక్సెస్ చేసింది.

క్లబ్ లే - మబ్బు లే.. అనే రేడియో ఆల్బంతో బాగా పాపులర్ అయ్యారు ఈ జంట సంగీత దర్శకులు. ఈ ఆల్బం విడుదలైన వారంలోనే 20 లక్షల వ్యూస్ తో సంచనలం సృష్టించడంతో.. ఇంటర్నేషనల్ బ్రాండ్ రెమీ మార్టిన్.. వీరి తర్వాత ఆల్బం హిప్ హాప్ తమీజా ఆల్బంని ఆవిష్కరించింది. అక్కడి నుంచి వీరి క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ ఇద్దరూ కలిసి రీసెంట్ గా తమిళ మూవీ తని ఒరవన్ కి సంగీతం అందించారు. ఆ మూవీ సక్సెస్ కి మ్యూజిక్కే అసలు కిక్ కావడంతో.. ఇప్పుడు తెలుగు వెర్షన్ కి కూడా వీళ్లనే తీసుకుంటున్నారు.

రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కనున్న తెలుగు రీమేక్ కి.. ఆది - జీవాలు సంగీతం అందించనున్నారని టాక్‌.. అయితే.. తమిళ్ వెర్షన్ మ్యూజిక్ ని యాజిటీజ్ ఇవ్వడం లేదని చెప్పేశారట. ఐదు కొత్త అదిరిపోయే ట్యూన్స్ ని రెడీ చేస్తున్నారట. తమిళ్ కంటే తెలుగులో పాటలు ఎక్కువగా ఉండనుండడమే దీనికి కారణం. అలాగే ఈ మూవీకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పటివరకూ ఫైనల్ చేయకపోయినా.. తెలుగు తనీ ఒరువన్ లో చెర్రీ సరసన శృతి హాసన్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.