Begin typing your search above and press return to search.

ఏడవ సినిమా సెంటిమెంట్ ని నమ్ముకుంటున్నాడు

By:  Tupaki Desk   |   8 Feb 2016 4:25 AM GMT
ఏడవ సినిమా సెంటిమెంట్ ని నమ్ముకుంటున్నాడు
X
టాలీవుడ్ లో సెంటిమెంట్ లకు కొదవలేదు. అయితే వీటిలో బాగా పేరొచ్చిన సెంటిమెంట్లు ఏమిటంటే డైరెక్టర్ రెండవ సినిమా ఫ్లాపవుతుందని, హీరో ఏడవ సినిమా సూపర్ హిట్ అవుతుందని.. పవన్ కళ్యాణ్ కి ఖుషి - తారక్ కి సింహాద్రి - మహేష్ కి ఒక్కడు వంటి బ్లాక్ బస్టర్ లు వారికి ఏడవ సినిమాలు కావడం విశేషం.

ఇప్పుడీ సెవెన్త్ మూవీ సెంటిమెంట్ పై మరో యువహీరో ఆశలు పెట్టుకుంటున్నాడు. ప్రేమకావాలి - లవ్లీ తరువాత హిట్లకు నోచుకోని ఆది ఈ వారం గరం సినిమాతో మన ముందుకు రానున్నాడు. ఆదికి ఇది ఏడవ సినిమా కావడం విశేషం - పెళ్ళైన కొత్తలో - ప్రవరాఖ్యుడు వంటి సినిమాలను అందించిన మదన్ ఈ చిత్రానికి దర్శకుడు.

శర్వానంద్ - నాని వంటి యంగ్ హీరోలు అందిస్తున్న కాంపిటీషన్ ని తట్టుకోవాలంటే ఆది ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొట్టాలి. ఆది సరసన అదా శర్మ నటిస్తుంది. వాణిజ్య విలువలు పుష్కలంగా వున్నట్టు తెలుస్తుంది.