తంబిలకు లుక్ తో షాకిస్తానంటున్న హీరో!

Tue Sep 18 2018 19:11:12 GMT+0530 (IST)

ఇప్పుడు సినిమాల్లో కంటెంట్ తో పాటు కటౌట్ లో కూడా మార్పులు చూపించడం అవసరమే. మన హీరోలు ఫిజిక్ మార్చుకోవడం..   లుక్ ను పూర్తిగా మార్చడం అనేవి ఇప్పుడు కామన్ అవుతున్నాయి. బాబుగారి పాత్ర కోసం రానా ఎలా చిక్కిసగమయ్యాడో మనం చూస్తూనే ఉన్నాం కదా. ఇక మరో హీరో అది పినిశెట్టి తన తాజా చిత్రంకోసం లుక్ మారుస్తానని అంటున్నాడు.తెలుగులో చిన్న చిత్రంగా రిలీజ్ అయిన 'RX100' బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.  బడ్జెట్ 2.5 కోట్లయితే.. సినిమా 12.5 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది.  నూతన దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ - పాయల్ రాజ్ పుత్ హీరో హీరోయిన్లు గా తెరకెక్కిన ఈ సినిమాను ఇప్పుడు తమిళభాషలోకి రీమేక్ చేస్తున్నారు.  ఈ రీమేక్ లో హీరో ఆది పినిశెట్టి.  రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమాలో తన లుక్ ను చూసి ప్రేక్షకులు షాక్ అవుతారని చెప్పాడు.

తెలుగుప్రేక్షకులను ఆల్రెడీ కార్తికేయ షాక్ చేశాడు కాబట్టి ఇక అది ఇవ్వబోయే షాక్ తమిళ ప్రేక్షకులకే.  ఇప్పటికే తమిళంలో హీరోగా మంచి గుర్తింపే ఉంది కాబట్టి ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాలని ఆది పట్టుదలగా ఉన్నాడట.