Begin typing your search above and press return to search.

టాలీవుడ్ హీరోలతో సూపర్ హీరోల పోటీ

By:  Tupaki Desk   |   25 April 2018 11:30 PM GMT
టాలీవుడ్ హీరోలతో సూపర్ హీరోల పోటీ
X
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో రెండు బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి. రామ్ చరణ్ మూవీ రంగస్థలం.. మహేష్ బాబు మూవీ భరత్ అనే నేను సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నాయి. ఈ ఇద్దరు హీరోలకు ఇప్పుడు గట్టి పోటీ ఎదురుకానుంది. అదీ ఒకరిద్దరు కాదు ఏకంగా 20 మంది సూపర్ హీరోల నుంచి.

హాలీవుడ్ లో వచ్చే మార్వెల్ బ్యానర్ నుంచి వచ్చే సూపర్ హీరోలకు భారత్ లో బోలెడుమంది అభిమానులున్నారు. అదీ సూపర్ హీరోలంతా కలిసికట్టుగా పోరాడే అవెంజర్స్ సిరీస్ మరీ ఇష్టపడతారు. అవెంజర్స్ లో మూడో పార్టయిన ఇన్పినిటీ వార్ ఈ వారం థియేటర్లకొస్తోంది. ఇందులో దాదాపు 20 మంది సూపర్ హీరోలు కలిసి విలన్లయిన థానోస్ పోరాడనున్నారు. ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా బజ్ మామూలుగా లేదు. మనదగ్గరా అడ్వాన్స్ బుకింగ్ లు భారీగా అయ్యాయి.

అవెంజర్స్ మొదటి రెండు పార్టులూ తెలుగులో డబ్ అయి కలెక్షన్లు కొల్లగొట్టాయి. దానిని దృష్టిలో ఉంచుకుని ఇన్ఫినిటీ వార్ ను కూడా డబ్ చేశారు. దీంతో బి.. సి సెంటర్లలో సైతం ఈ మూవీ విడుదల కానుంది. పిల్లలంతా ఇష్టపడే మూవీ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఆదరణ బాగా ఉంటుంది. రంగస్థలం.. భరత్ అనే నేనుకు ఫ్యామిలీ ఆడియన్సే ఎక్కువగా వస్తున్నారు. ఈ వారం నుంచి అవెంజర్స్ రావడంతో వాటి ప్రభావం ఈ రెండు సినిమాలపై పడే అవకాశముంది. అదెంతవరకు ఉంటుందనేది ఈవీకెండ్ కల్లా క్లారిటీ వచ్చేస్తుంది.