Begin typing your search above and press return to search.

అక్కడే ఉన్నా అవార్డులకు మాత్రం రాలే

By:  Tupaki Desk   |   18 July 2017 12:30 AM GMT
అక్కడే ఉన్నా అవార్డులకు మాత్రం రాలే
X
ఓ ప్రాంతంలో సినిమా పండుగ జరుగుతుంటే.. అదే ప్లేస్ లో ఉన్న ఏ స్టార్ అయినా.. అటెండ్ అయేందుకు ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ మాత్రం ఇందుకు పక్కా వ్యతిరేకంగా బిహేవ్ చేయడం ఇప్పుడు విమర్శలకు దారి తీస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలకు సంబంధించి ఐఫా అవార్డుల పండుగ న్యూయార్క్ లో నిర్వహించిన సంగతి తెలిసిందే.

బోలెడంత మంది బాలీవుడ్ తారలు ఇక్కడ తళుక్కుమంటున్నారు. అవార్డులు వచ్చినా రాకపోయినా.. పిలుపు అందితే మాత్రం పెద్దగా భేషజాలు పెట్టుకోకుండా ఇలాంటి ఈవెంట్స్ లో సందడి చేస్తుంటారు. అనుష్క శర్మ కూడా ప్రస్తుతం న్యూయార్క్ లోనే ఉంది. కానీ ఐఫా అవార్డు వేడుకల్లో మాత్రం ఈ భామ కనిపించలేదు. అక్కడే ఉన్నా.. అవార్డు వేడుకల్లో కనిపించకుండానే న్యూయార్క్ వీధుల్లో చక్కర్లు కొట్టేస్తోంది ఈ బ్యూటీ. ఇంతకీ అక్కడేం చేస్తోందంటారా.. ఎంచక్కా తన ప్రియుడు విరాట్ కోహ్లీతో కలిసి షాపింగ్.. షికార్లతో తెగ బిజీగా ఉంది.

చివరకు షారూక్ ఖాన్ తో కలిసి నటించిన జబ్ హ్యారీ మెట్ సెజల్ సినిమా ప్రమోషన్స్ కోసం.. కింగ్ ఖాన్ ఒక్కడే కష్టపడతున్నా సరే పట్టించుకోకుండా.. విరాట్ కోహ్లీతో షికార్లకే ప్రాధాన్యత ఇస్తోంది. పైగా వీరిద్దరూ తమ న్యూయార్క్ టూర్స్ గురించి సెపరేట్ గా పోస్టులు పెడుతున్నారు. ఇదే సినిమా జనాలకు బాగానే కోపం తెప్పిస్తోంది.