Begin typing your search above and press return to search.

టాలీవుడ్ త‌ర‌లి రావ‌డంలో ఏఎన్నార్ కృషి

By:  Tupaki Desk   |   20 Sep 2019 2:30 PM GMT
టాలీవుడ్ త‌ర‌లి రావ‌డంలో ఏఎన్నార్ కృషి
X
తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు ఎన్టీఆర్- ఏఎన్నార్ రెండు కళ్ళవంటి వారు. మ‌ద్రాస్ ప‌రిశ్ర‌మ హైద‌రాబాద్ లో స్థిర‌ప‌డ‌డానికి ఆ ఇద్ద‌రూ చేసిన కృషి అంత తేలిగ్గా మ‌రువ‌లేనిది. అప్ప‌ట్లోనే హైద‌రాబాద్ న‌గ‌రంలో ఎన్టీఆర్ రామ‌కృష్ణ స్టూడియోస్ ని నిర్మిస్తే.. ఏఎన్నార్ అన్న‌పూర్ణ స్టూడియోస్ ని ప‌రిశ్ర‌మ‌కు అంకిత‌మిచ్చారు. సినిమా స్టూడియోల నిర్మాణం వ‌ల్ల పెద్ద‌గా క‌మ‌ర్షియ‌ల్ గా ఒరిగేదేమీ ఉండ‌ద‌ని తెలిసి ఈ మ‌హానుభావులు ఆనాడు సినిమా అనే క‌ళ‌ను బ‌తికించేందుకు వీటిని నిర్మించారు. క‌ళారంగానికి ఇక‌ ఎన్టీఆర్-ఏఎన్నార్ ల‌తో పాటు మూవీ మొఘ‌ల్ డా.డి.రామానాయుడు-దాస‌రి వంటి వారి కృషిని అభిమానులు ఎప్ప‌టికీ గుర్తుంచుకుంటారు.

హైద‌రాబాద్ లో నిర్మించిన‌ స్టూడియోల వ‌ల్ల‌నే సినిమాల నిర్మాణం పెరిగి.. ఉపాధి పెరిగి మద్రాస్ నుంచి టాలీవుడ్ ని హైదరాబాద్ కు తీసుకురాగ‌లిగారు. ఎన్టీఆర్ సినీరంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఏఎన్నార్ రాజకీయాలవైపు మొగ్గు చూపకుండా .. చివరి శ్వాస వరకు సినిమాలే లోకంగా జీవించారు. ఏఎన్నార్ బయోపిక్ తీస్తార‌ని వార్త‌లు వ‌చ్చినా వాటిని గ‌తంలో కింగ్ నాగార్జున ఖండించారు. ఏఎన్నార్ నటించిన ఏ సినిమాను రీమేక్ చేసే ఆలోచన చేయలేమని .. అలాగే బయోపిక్ చేసే సాహ‌సం చేయ‌లేమ‌ని అన్నారు నాగార్జున‌.

నేడు ఏఎన్నార్ జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న అభిమానులు సామాజిక మాధ్య‌మాల్లో సంస్మ‌ర‌ణం చేసుకున్నారు. అన్న‌పూర్ణ స్టూడియోస్ ట్విట్ట‌ర్ ప్ర‌ధాన ఇమేజ్ ఏఎన్నార్ సినిమాల పోస్ట‌ర్ల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతోంది. ఫేస్ బుక్ లో అభిమానుల‌తో.. ప‌లువురు ప్ర‌ముఖుల‌తో ఏఎన్నార్ వీడియో ఆక‌ర్షిస్తోంది. #ANR లివ్స్ ఆన్ నినాదం ఎప్ప‌టికీ అభిమానుల గుండెల్లో అలానే ప్ర‌తిధ్వ‌నిస్తూ ఉంటుంది. క్లాసిక్ డేస్ రారాజుగా ఆయ‌న అభిమానుల హృద‌యాల్లో కొలువై ఉన్నారు. నేడు ఆయ‌న జ‌యంతి సంద‌ర్భంగా ఈటీవీలో ఉద‌యం 7 గం.ల నుంచి వ‌రుస‌గా అత‌డు న‌టించిన క్లాసిక్ సినిమాల్ని ప్ర‌ద‌ర్శిస్తోంది. అమ‌ర‌జీవి-ప‌ల్నాటి యుద్ధం-బంగారు బొమ్మ‌లు-ఇల్లాలే దేవ‌త‌- బంగారు రాజు వంటి చిత్రాల్ని ప్ర‌ద‌ర్శిస్తోంది.