Begin typing your search above and press return to search.

పవన్ రీమేక్ రైటే.. డైరెక్టర్ నాట్ ఓకే

By:  Tupaki Desk   |   7 Feb 2016 3:47 AM GMT
పవన్ రీమేక్ రైటే.. డైరెక్టర్ నాట్ ఓకే
X
పవన్ కళ్యాణ్ కొత్త ప్రాజెక్టుపై బోలెడు కబుర్లు వినిపిస్తున్నాయి. ఇంకా ప్రస్తుతం చేస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ పూర్తి కాకముందే కొత్త సినిమా కబుర్లు మొదలైపోయాయి. ఇప్పటికే చాలా సంగతులు వినిపించినా.. ఓ రీమేక్ గురించి మాత్రం ఎక్కువగా చెప్పుకోవాల్సి వస్తోంది.

తమిళ్ లో సూపర్ హిట్ అయిన వేదాళం చిత్రాన్ని తెలుగు రీమేక్ రెడీ అవుతోంది. కోలీవుడ్ లో అజిత్ నటించిన ఈ మూవీని.. తెలుగులో పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేయనున్నారు. ఈ విషయాన్ని రెండు రోజుల క్రితం నిర్మాత ఏఎం రత్నం అధికారికంగానే వెల్లడించారు. సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తారనే చెప్పలేదు కానీ.. పవన్ తో మాత్రం మూవీ ఖచ్చితంగా ఉందన్నారు రత్నం. అయితే.. ఈ మూవీకి సంతోష్ శ్రీనివాస్ ని డైరెక్టర్ గా ఫిక్స్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ తో రభస తీసిన ఈ డైరెక్టర్ కు మరో ఛాన్స్ వచ్చిందంటున్నారు.

కానీ తమ చిత్రం కన్ఫాం అయిన మా వాస్తవమే అయినా.. మిగిలిన టెక్నికల్ టీం ని ఫిక్స్ చేయలేదని, ఇంకా ఎవరినీ అనుకోలేదని చెప్పారు నిర్మాత ఏ ఎం రత్నం. సంతోష్ శ్రీనివాస్ ని దర్శకుడిగా ఎంపిక చేసినట్లు వస్తున్న వార్తలు పుకార్లే అని తేల్చేశారు. ప్రస్తుతం గబ్బర్ సింగ్ సీక్వెల్ సర్దార్ గబ్బర్ సింగ్ లో నటిస్తున్న పవన్ కళ్యాణ్.. అది రిలీజ్ అయ్యాక మిగిలిన విషయాలను ఎనౌన్స్ చేస్తారని చెప్పాడీ నిర్మాత.