Begin typing your search above and press return to search.

డివిలియ‌ర్స్ కొడుకు పేరు తెలుసా!?

By:  Tupaki Desk   |   18 May 2018 8:11 AM GMT
డివిలియ‌ర్స్ కొడుకు పేరు తెలుసా!?
X
ఏబీ డివిలియ‌ర్స్... ఈ ద‌క్షిణాఫ్రికా క్రికెట‌ర్ కి మ‌న‌దేశంలో కూడా బీభ‌త్స‌మైన ఫ్యాన్ ఫ్యాలోయింగ్ ఉంది. అత‌ని సొగ‌సైన బ్యాటింగుతో పాటు సున్నిత‌మైన మ‌న‌స్త‌త్వం కూడా ఏబీడీకి విప‌రీత‌మైన క్రేజ్ కి కార‌ణం. ఐపీఎల్ సీజ‌న్లో ఆర్‌.సీ.బీ జ‌ట్టుకు ఆడుతున్న డివిలియ‌ర్స్‌... కోహ్లీతో పాటు ఫోర్లు సిక్స‌ర్ల‌తో ఇన్నింగ్స్ నిర్మిస్తూ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నాడు.

అవ‌న్నీ ప‌క్క‌న పెడితే ఏబీ డివిలియ‌ర్స్ అంటే భార‌తీయుల‌కు ఎంతిష్ట‌మో... ఇండియా అంటే ఏబీడీకి అంతే ఇష్టం. ముఖ్యంగా ప్రేమ‌కు చిహ్న‌మైన ప్ర‌పంచ వింత తాజ్ మ‌హాల్ అంటే డివిలియ‌ర్స్‌కి ప్ర‌త్యేక‌మైన అభిమానం. త‌న గార్ల్ ఫ్రెండ్ డానిఎలీతో ఐదేళ్లు డేటింగ్ చేసిన త‌ర్వాత తాజ్ మ‌హాల్ ద‌గ్గ‌రే పెళ్లి ప్ర‌పోజ‌ల్ తెచ్చాడు ఏబీ డివిలియర్స్‌. పెళ్ల‌యిన త‌ర్వాత వీరికి 2015లో ఒక‌బ్బాయి- గ‌త ఏడాది మ‌రో అబ్బాయి పుట్టాడు. మొద‌టి అబ్బాయి అబ్ర‌హం డివిలియ‌ర్స్ అని పేరు పెట్టిన ఈ దంప‌తులు... రెండో సంతానికి జాన్ రిచ‌ర్డ్ అని పేరు పెట్టారు. మూడో సంతానికి మాత్రం భార‌త‌దేశం మీద త‌న‌కున్న ప్రేమ ప్ర‌తిబింబించేలా పేరు పెట్టాల‌నుకుంటున్నాడు ఈ స్టార్ క్రికెట‌ర్‌.

సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెట‌ర్‌ జాంటీ రోడ్స్ కూతురికి ఇండియా అని పేరు పెట్టాడు. అదే స్పూర్తితో మొద‌ట త‌న కొడుక్కి ‘క‌ర్ణాట‌క’ అని పేరు పెట్టాల‌నుకున్నాడ‌ట ఏబీ డివిలియ‌ర్స్‌. ఐపీఎల్‌ లో త‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న బెంగుళూరు జ‌ట్టు మీద కృత‌జ్ఞ‌త‌తో ఈ పేరు అనుకున్నా... ఇప్పుడు త‌న పెళ్లికి కార‌ణ‌మైన తాజ్ మ‌హాల్ పేరు వ‌చ్చేలా ‘తాజ్‌’ అని పేరు ఫిక్స్ చేశాడ‌ట ఏబీడీ. పుట్టబోయేది అమ్మాయో... అబ్బాయో తెలియ‌క‌పోయినా పేరు మాత్రం తాజ్ అని చెప్పేస్తున్నాడు ఏబీ. ఐపీఎల్ ప్ర‌భావం విదేశీ క్రికెట‌ర్లు మ‌న‌దేశాన్ని ఇంత‌లా ప్రేమించేలా చేస్తోంది.