Begin typing your search above and press return to search.

సల్మాన్ భార్య.. రచ్చ రచ్చ చేసింది

By:  Tupaki Desk   |   17 March 2018 4:18 AM GMT
సల్మాన్ భార్య.. రచ్చ రచ్చ చేసింది
X
బాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్ సల్లూ భాయ్ మ్యారేజియే. ఐదు పదులు దాటినా పెళ్లి చేసుకోకుండా మోస్ట్ వాంటెడ్ బ్యాచులర్ లైఫ్ గడిపేస్తున్నాడు. సీనియర్ హీరో అయినప్పటికీ బాలీవుడ్ లో అతడికున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకెవరికీ లేదనే చెప్పాలి. ముఖ్యంగా లేడీస్ లో సల్మాన్ ఖాన్ కు మంచి ఇమేజ్ ఉంది.

లేటెస్ట్ గా సల్మాన్ కు ఓ వీరాభిమాని తగిలింది. ఈమె మిగతావారందరి కన్నా ఓ అడుగు ముందుకేసి సల్మాన్ ఖాన్ తన మొగుడని ప్రకటించేసింది. అంతేకాదు.. ఏకంగా సల్మాన్ ఖాన్ ఉండే అపార్ట్ మెంట్ లోకి ప్రవేశించింది. చాలా కట్టుదిట్టమైన భద్రత ఉండే ఈ అపార్ట్ మెంట్ సెక్యూరిటీ స్టాఫ్ కళ్లు గప్పి లోపలకు వచ్చేసింది. సల్మాన్ ఉండే ఫ్లాట్ దగ్గరకు వచ్చి తలుపులు బాదుతూ హడావుడి చేయడం మొదలెట్టేసరికి అలారం ఆన్ అయిపోయింది. ఆమెను పట్టుకోవాలని ప్రయత్నించినప్పుడు సల్మాన్ నా మొగుడు అంటూ పెద్దపెద్ద కేకలు పెడుతూ హంగామా చేసింది.

కాకపోతే ఈ ఇష్యూ జరిగిన టైంలో సల్లూభాయ్ అసలు ఇండియాలోనే లేడు. రేస్-3 సినిమా షూటింగ్ కోసం ఫారిన్ వెళ్లాడు. ఈ విషయంలో తెలియని సదరు అభిమాని సల్మాన్ ఉన్నాడని అనుకుని ఇంత హడావుడి చేసింది. అయితే దీనిపై ఎక్కడా పోలీస్ కేస్ ఏమీ రిజిస్టర్ కాలేదు. అభిమానుల్లో కాస్తంత ఓవర్ గా రియాక్ట్ అయేవాళ్లుంటారు అనుకుని వదిలిపెట్టేశారు.