Begin typing your search above and press return to search.

దీపిక‌ను న‌వ్వించిన రెస్టారెంట్ పేరు

By:  Tupaki Desk   |   27 Jun 2017 9:30 AM GMT
దీపిక‌ను న‌వ్వించిన రెస్టారెంట్ పేరు
X
బాలీవుడ్ లో అత్యంత సొగ‌సుక‌త్తెల్లో ఒక‌రు దీపికా ప‌దుకునే. ఈ నాజూకు భామ అందాలు వ‌య‌సుతో సంబంధం లేకుండా ఎంత‌గా పిచ్చెక్కిస్తాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఇటీవ‌ల వార్త‌ల‌కు దూరంగా ఉంటున్న ఈ భామ తాజాగా ఒక ఆస‌క్తిక‌ర విష‌యాన్ని చెప్పుకొచ్చింది. అప్పుడెప్పుడో ఆమె న‌టించిన ఒక సినిమాకు సంబంధించిన డైలాగ్ తో ఏకంగా ఒక రెస్టారెంట్ నే పెట్ట‌డం చూసి ఆమె స‌ర్ ప్రైజ్ గా ఫీలైంద‌ట‌.

గ‌తంలో షారుక్‌.. దీపిక జంట‌గా న‌టించిన చిత్రం చెన్నై ఎక్స్ ప్రెస్‌. ఈ సినిమా ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాలో తంగ‌బ‌లి అంటూ ఫ‌న్నీగా డైలాగ్ చెప్పే సీన్ ఉంటుంది. ఆ డైలాగ్ ఈ సినిమాతో చాలా ఫేమ‌స్ అయ్యింది. ఈ డైలాగ్ ఎంత‌గా న‌చ్చిందో కానీ.. ముంబ‌యిలో ఏకంగా తంగ‌బ‌లి పేరుతో ఒక రెస్టారెంట్‌ ను పెట్టేశారు.

ఇటీవ‌ల కారులో త‌న ఫ్లాట్ కు వెళుతున్న దీపికకు.. ఈ రెస్టారెంట్ క‌నిపించింద‌ట‌. తంగ‌బ‌లి పేరును చూసిన వెంట‌నే ఆమెకు న‌వ్వు ఆపుకోలేక‌పోయింద‌ట‌. తన‌ను ఇంత‌గా న‌వ్వించిన ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో దీపిక షేర్ చేసుకుంది. రెస్టారెంట్ పేరు చాలా ఫ‌న్నీగా ఉంద‌ని.. న‌వ్వు ఆపుకోలేక‌పోయాన‌ని.. త్వ‌ర‌లోనే తాను ఆ రెస్టారెంట్‌కు వెళ్ల‌నున్న‌ట్లుగా దీపిక చెప్పింది. దీపిక వెళ్ల‌టం సంగ‌తి త‌ర్వాత‌.. అమ్మ‌డి కంటప‌డి.. ఓవ‌ర్ నైట్ లో ఈ రెస్టారెంట్ పాపుల‌ర్ అయిపోయింద‌న‌టంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/