Begin typing your search above and press return to search.

నాని హీరోయిన్.. వార్నింగ్ వర్కవుటైందే

By:  Tupaki Desk   |   26 July 2016 5:13 AM GMT
నాని హీరోయిన్.. వార్నింగ్ వర్కవుటైందే
X
నేచురల్ నానితో కలిసి జెంటిల్మన్ లో నటించిన మలయాళ బ్యూటీ నివేదా థామస్ కు.. టాలీవుడ్ లో ఇప్పుడు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అయితే.. జెంటిల్మన్ ఈమెకు తొలి చిత్రం అని అందరూ అనుకుంటారు కానీ.. అంతకు ముందే ఈమె జూలియట్- లవర్ ఆఫ్ ఈడియట్ అనే సినిమాకు సైన్ చేసింది. ఆ ప్రాజెక్టు బాగా ఆలస్యమైంది.

ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేసేందుకు మేకర్స్ నివేదను చాలాసార్లు సంప్రదించినా ఈమె కాల్షీట్స్ కేటాయించేందుకు ససేమిరా అనేసిందని టాక్. దీంతో సౌత్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ దగ్గరకు ఈ వివాదాన్ని తీసుకెళ్లారు. సినిమా పూర్తయ్యేందుకు సహకరించకపోతే ఆమెను సౌత్ సినిమాల నుంచి సస్పెండ్ చేస్తామని వారు వార్నింగ్ ఇచ్చారు. దీంతో భయపడ్డ నివేదా.. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు అంగీకరించింది. నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం రామానాయుడు స్టూడియోస్ లో జరుగుతోంది.

జూలియట్- లవర్ ఆఫ్ ఈడియట్ ప్రాజెక్టు విషయంలో నివేద భయపడుతోందని.. ప్రస్తుతం క్రేజీ ఆఫర్లు వస్తుండడంతో తన ఇమేజ్ కు దెబ్బ తగులుతుందనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమా షూటింగ్ కి మొదట నిరాకరించిందట నివేదా థామస్. వక్కంతం వంశీ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న మరుసటి చిత్రంలో నివేదాను హీరోయిన్ గా తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది.