బ్రూస్ లీ పంచులకు రెహ్మాన్ స్వరాలు

Sun Aug 13 2017 13:59:23 GMT+0530 (IST)

హాలీవుడ్ లో ఎంతోమంది చేద్దాం అనుకుని డ్రాప్ అయిపోయిన సినిమా ఏదైనా ఉందా అంటే.. అది ఖచ్చితంగా బ్రూస్ లీ సినిమా అనే చెప్పాలి. ఇప్పటికీ ఈ లెజండ్ మరణం అనేది కాంట్రోవర్షియల్ అంశమే. అలాంటి లెజండ్ పై సినిమా అంటే కూడా చాలామంది ఆసక్తి చూపింట్లేదు. అలాంటి టైములో మన ఇండియన్ డైరక్టర్ అయిన శేఖర్ కపూర్.. ఇప్పుడు 'లిటిల్ డ్రాగన్' పేరుతో బయోపిక్ తీస్తున్నాడు. ఇది నిజంగానే పెద్ద విషయమే.

బ్రూస్ లీ అసలు హాంగ్ కాంగ్ నుండి అమెరికా వెళ్లడం.. మద్యలో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం.. స్టంట్ మ్యాన్ గా వచ్చిన హీరో అవ్వడం.. దర్శకుడు అయ్యి మైండ్ బ్లోయింగ్ సినిమాలు తీయడం. ప్రొడ్యూస్ చేయడం. చారిటీలో పాల్గొనడం. పెల్ళి.. పిల్లలు.. అనుకోకుండా చనిపోవడం.. వంటి ప్రతీ అంశాన్ని శేఖర్ కపూర్ తెరకెక్కించనున్నరట. అయితే ఈ సినిమాకు స్వరాలు ఎవరు సమకూరుస్తారు అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న టైములో.. ఈ సినిమాకు ఏ.ఆర్.రెహ్మాన్ ముందుకొచ్చాడు. ఆల్రెడీ రెండుసార్లు ఆస్కార్ గెలుచుకున్న రెహ్మాన్.. ఇప్పుడు మరోసారి హాలీవుడ్ కు తన సత్తా చాటే పనిలో బిజీగా ఉన్నాడు.

మొత్తానికి వెండితెరపై మరోసారి మనం బ్రూస్ లీ జీవితపు పంచులను చూస్తాం. అయితే ఈసారి రెహ్మాన్ స్వరాల సాక్షిగా వాటిని ఆలకిస్తూ తిలకిస్తాం. అది సంగతి.