Begin typing your search above and press return to search.

నగ్నంగా వీడియో తీయించుకున్న హీరో

By:  Tupaki Desk   |   18 March 2018 7:44 AM GMT
నగ్నంగా వీడియో తీయించుకున్న హీరో
X
సినిమా తారలకు ఎదురయ్యే అనుభవాలు భలే విచిత్రంగా ఉంటాయి. కొన్ని సరదాగా అనిపిస్తే కొన్ని చికాకు పుట్టిస్తాయి. బాలీవుడ్ హీరో రన్వీర్ సింగ్ అలాంటిదే ఒకటి పంచుకున్నాడు. ఓసారి డ్రెస్సింగ్ రూమ్ నుంచి స్నానం చేసి బయటికి వస్తున్న రన్వీర్ సింగ్ బయట ఎవరు ఉండరు అనే ఉద్దేశంతో నగ్నంగానే వచ్చేసాడు. కాని ఊహించని విధంగా అక్కడ ఒకడు వీడియో తీస్తూ కనిపించాడట. తీరా చూస్తే తాను లోపలి వెళ్ళడం మొదలుకుని బయటికి రావడం దాకా అంతా అందులో షూట్ అయ్యి ఉందట. వెంటనే అతని చేతిలో ఉన్న ఫోన్ లాగేసుకుని డిలీట్ చేసిన రన్వీర్ సింగ్ చూడగానే షాక్ అయ్యాడట. సాధారణంగా హీరోలు ఇలా డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్నప్పుడు ఎవరు పెద్దగా పట్టించుకోరు. కాని అదే పనిగా రన్వీర్ సింగ్ స్నానానికి వెళ్ళినప్పుడే అతగాడు వెంటపడ్డాడు అంటే వింతే .

నిజానికి రన్వీర్ సింగ్ మోస్ట్ ఐకానిక్ హీరోగా బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఫ్యాషన్ విషయంలో కూడా కొత్త కొత్త ట్రెండ్స్ అలవాటు చేసుకునే ఈ విలన్ కం హీరో పద్మావత్ తర్వాత ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఎటువంటి పాత్ర అయినా ఈజీగా పరకాయ ప్రవేశం చేస్తాడనే పేరు తెచ్చుకోవడంతో దర్శక నిర్మాతలు ఇతగాడి డేట్స్ కోసం క్యు కడుతున్నారు. ప్రస్తుతం గల్లీ బాయ్ షూటింగ్ లో బిజీ గా ఉన్న రన్వీర్ సింగ్ కు హీరొయిన్ దీపికా పదుకునేతో చాలా ఘాడమైన ప్రేమాయణం సాగుతోంది అనే టాక్ ఏడాదికి పైగానే బాలీవుడ్ మీడియాలో వినిపిస్తోంది. కాని ఇద్దరు బయటికి చెప్పలేదు కాని ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్ళడం అనుమానాన్ని బలపరుస్తోంది.

దీపికా ప్రస్తుతం రెస్ట్ లో ఉంది. వెన్ను నొప్పితో పాటు విటమిన్ డి డెఫిషియన్సీ తో బాధ పడుతూ షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చి మరీ రెస్ట్ తీసుకుంటోంది. అందుకే మాల్దీవ్స్ లో వేసుకున్న పెళ్లి ప్లాన్ కూడా వాయిదా పడిందని టాక్ కాస్త గట్టిగానే ఉంది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఇప్పటి దాకా మూడు సినిమాల్లో కలిసి నటించిన దీపికా-రన్వీర్ సింగ్ లు మరోసారి జట్టు కట్టే అవకాశాలు ఉన్నాయి. ఆ మేరకు భన్సాలీ స్క్రిప్ట్ సిద్ధం చేసాడట.