Begin typing your search above and press return to search.

సన్నీ కొత్త వీడియో చూశారా?

By:  Tupaki Desk   |   27 Aug 2016 3:56 AM GMT
సన్నీ కొత్త వీడియో చూశారా?
X
ఇండియాలో బాలీవుడ్ స్టార్ సన్నీలియోన్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఇక కుర్రకారులో సన్నీకి ఉన్న క్రేజ్ గురించి ఎంత మాట్లాడుకున్న తక్కువే. అయితే తాజాగా సన్నీకి సంబందించిన ఒక వీడియో యూ ట్యూబ్ లో హల్ చల్ చేస్తుంది. సన్నీ వీడియో యూ ట్యూబ్ లో ఏమిటి అని మరోకోణంలో ఆలోచించకండి.. ఇది మామూలు వీడియోనే! ఈ వీడియోలో ఒక చిన్నారి పాపను సన్నీ ఎత్తుకుంది. అనంతరం ఆమెనుంచి వింతైన ఘటన ఎదురైంది.

ఒక సినిమా షూటింగ్‌ గ్యాప్ సమయంలో ముద్దుగా ఉన్న ఓ చిన్నారిని సన్నీ ఎత్తుకొని కాసేపు ఆడించింది. దీంతో బాగా తెలిసినవారి దగ్గరున్నట్లుగా ఆ పాప సన్నీ భుజాలపై తలవాల్చి - హాయిగా ఉండిపోయింది. అయితే కాసేపటి తర్వాత ఆ పాప తల్లితండ్రులు సన్నీ నుంఛి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ ఆ పాప సన్నీని వీడి రాలేదు. సన్నీ ఆ చిన్నారిని వదిలేందుకు ప్రయత్నించినా.. ఇంకా గట్టిగా హత్తుకొని అలాగే ఉండిపోయింది. ఈ విషయాన్ని గమనించిన సన్నీ.. తల్లిదండ్రులకు బై చెప్పమని ఆ అమ్మాయికి చెప్పి కాస్త దూరం తీసుకెళ్లింది. అయినా కూడా ఆ పాప నవ్వుతూనే ఉండిపోయింది కానీ తల్లిదండ్రుల వద్దకు వెళ్లలేదు. చివరకు అయిష్టంగానే సన్నీని వీడి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చింది.

దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌ స్టాగ్రామ్‌ లో పోస్ట్‌ చేసి.. ఆ పాప తనను ఆనందం - ఆశ్చర్యానికి గురిచేసిందని సన్నీ తెలిపింది. అనంతరం యూట్యూబ్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. కాగా ఆ అమ్మాయి ఎవరు? ఈ ఘటన ఎక్కడ జరిగింది? అనే విషయాలు తెలియరాలేదు.