Begin typing your search above and press return to search.

క్రిష్ భార్య అతడిని ఇంటర్వ్యూ అడిగిన వేళ..

By:  Tupaki Desk   |   23 Jan 2017 8:11 AM GMT
క్రిష్ భార్య అతడిని ఇంటర్వ్యూ అడిగిన వేళ..
X
దర్శకులు కావాలనుకునే చాలామంది కుర్రాళ్లు తమ తొలి సినిమా విడుదలయ్యే వరకు పెళ్లి ఊసు ఎత్తరు. తొలి సినిమా విడుదలయ్యాకో.. మంచి విజయాన్నందుకున్నాకో పెళ్లి వైపు మొగ్గు చూపుతారు. ఐతే తొలి సినిమా ‘గమ్యం’తోనే మంచి విజయాన్నందుకున్న క్రిష్ మాత్రం.. ఇంకో దశాబ్దానికి కానీ పెళ్లి గురించి ఆలోచించలేదు. తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా.. సాహసోపేతంగా తెరకెక్కించిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా మధ్యలో ఉండగా అతను అనుకోకుండా పెళ్లి చేసేసుకున్నాడు. పెళ్లి తర్వాత తన భార్యకు పెద్దగా సమయం కేటాయించకుండా ఈ సినిమాకే అంకితమైపోయాడు. ఆ పరిస్థితుల్లో అతడి భార్య ఫీలింగ్స్ ఏంటి.. ఆమె తనపై ఎలాంటి సెటైర్లు వేసింది.. సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు క్రిష్.

పెళ్లయిన ఐదో రోజుకే తాను రమ్యను విడిచిపెట్టి తిరిగి.. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ షూటింగ్ కోసం వచ్చేసినట్లు క్రిష్ వెల్లడించగా.. తమ్మారెడ్డి ‘సిగ్గు లేదా’ అని క్రిష్ ను అడగ్గా అతను నవ్వేశాడు. ఇలాంటి పెద్ద సినిమా తీస్తూ మధ్యలో పెళ్లెందుకు చేసుకున్నావు.. సినిమా పూర్తయ్యే వరకు ఆగొచ్చు కదా అని అడిగితే.. ‘‘మంచి అమ్మాయి దొరికింది. వదిలేస్తే పారిపోతుందేమో అన్న భయంతో పెళ్లి చేసేసుకున్నా’’ అంటూ గట్టిగా నవ్వేశాడు క్రిష్. పెళ్లి తర్వాత ఏమైందో చెబుతూ.. ‘‘ఆమె నన్ను అర్థం చేసుకుంది కాబట్టి మళ్లీ సినిమా మీద పూర్తిగా దృష్టిపెట్టి అనుకున్నట్లుగా పూర్తి చేశాను. విడుదలకు ముందు ముంబయిలో ఉంటూ పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని.. హైదరాబాద్ వచ్చాను. ఇంటికి కూడా వెళ్లకుండా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తుంటే తన నుంచి ఒక మెసేజ్ వచ్చింది. మాకు కూడా ఒక ఇంటర్వ్యూ ఇవ్వొచ్చుగా అని నాపై సెటైర్ వేసింది’’ అని క్రిష్ తెలిపాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/