Begin typing your search above and press return to search.

`అఆ`కి క్లీన్ యు

By:  Tupaki Desk   |   25 May 2016 8:36 AM GMT
`అఆ`కి క్లీన్ యు
X
త్రివిక్ర‌మ్ అఆ సెన్సార్ తంతు పూర్తి చేసుకొంది. ఎటువంటి క‌ట్స్ లేకుండా సినిమా క్లీన్ యు స‌ర్టిఫికెట్ సొంతం చేసుకొంది. జూన్ 2న చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్నారు. ఆ మేర‌కు ఇప్ప‌టికే ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు ఊపందుకొన్నాయి.

త్రివిక్ర‌మ్ ఫ్యామిలీ స‌బ్జెక్టుతో సినిమా చేశాక క‌చ్చితంగా యు స‌ర్టిఫికెట్టే వ‌స్తుంది. స్వ‌చ్ఛ‌మైన హాస్యంతో, మంచి విలువ‌ల‌తో ఆయ‌న సినిమాలు తెర‌కెక్కిస్తుంటాడు. మ‌న మూలాల్ని గుర్తుకు చేసే ఉద్దేశంతోనే అఆ చేశాన‌ని త్రివిక్ర‌మ్ ఆడియో ఫంక్ష‌న్‌ లో చెప్ప‌గానే ఇది ఎలాంటి సినిమానో ప్రేక్ష‌కులు ఊహించేశారు. అనుకొన్న‌ట్టుగానే ఇప్పుడు సినిమాకి క్లీన్ యు వ‌చ్చింది.

వేస‌వి సంద‌ర్భంగా వ‌స్తున్న ఈ సినిమాకి పిల్లా పాప‌లు - త‌ల్లి దండ్రుల‌తో క‌లిసి స‌కుటుంబ స‌మేతంగా వెళ్లొచ్చ‌న్న‌మాట‌. నితిన్‌ - స‌మంత జంట‌గా న‌టించిన ఈ చిత్రంలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ మ‌రో క‌థానాయిక‌గా న‌టించింది. కామెడీ - కుటుంబ విలువ‌లే ఈ సినిమాకి హైలెట్ట‌ని చిత్ర‌వ‌ర్గాలు చెబుతున్నాయి. హీరో నితిన్‌ కి ఈ సినిమా చాలా కీల‌కం. చిన్న‌దాన నీకోసంలాంటి ప్లాప్ త‌ర్వాత నితిన్ చేసిన సినిమా ఇది. ఈ చిత్రంతో ఎలాగైనా హిట్టు కొట్టాల‌న్న ఉద్దేశంతో ఉన్నాడాయ‌న‌. మ‌రి ఆయ‌న కోరిక నెర‌వేరుతుందో లేదో చూడాలి.