Begin typing your search above and press return to search.

26 నుండి మాటలూ ముచ్చట్లూ మొదలు

By:  Tupaki Desk   |   24 May 2016 11:42 AM GMT
26 నుండి మాటలూ ముచ్చట్లూ మొదలు
X
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అ..ఆ.. చిత్రాన్ని.. జూన్ 2న విడుదల చేయనున్నామని ఇప్పటికే ప్రకటించేశారు. తెలంగాణలో రాష్ట్ర అవతరణ దినోత్సవం - రెండు రాష్ట్రాల్లోనూ సమ్మర్ హాలిడేస్ కారణంగా.. శుక్రవారం కాకుండా ఓ రోజు ముందే థియేటర్లలోకి వస్తోంది అ..ఆ. ఇప్పుడు ఈ సినిమా మీడియాతో మాటలూ ముచ్చట్లూ ఎప్పుడు పెట్టుకుంటుందో ఒక డేట్‌ వచ్చేసింది.

ఇప్పుడీ మూవీకి ప్రచార కార్యక్రమాలను ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఇఫ్పటికే టీవీ యాడ్స్ కనిపిస్తున్నా.. అది నామమాత్రమే. ప్రతీ సినిమాకి విభిన్నమైన స్టైల్లో ప్రచారం చేయడం త్రివిక్రమ్ కు అలవాటు. ఇప్పుడు కూడా అలాగే ఓ కొత్త స్ట్రాటజీతో అ..ఆ..ను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారట. మే 26న పబ్లిసిటీ కార్యక్రమాలను ప్రారంభించనుండగా.. అప్పటి నుంచి రిలీజ్ డేట్ వరకూ పక్కా ప్రమోషన్ షెడ్యూల్ ప్లాన్ చేశారని తెలుస్తోంది.

ఛానల్స్ లో స్పెషల్ హాఫెన్నవర్ స్పాట్స్ తీసుకుని ప్రమోట్ చేయడం, మీడియాకి ఇంటర్వ్యూలు ఇవ్వడం, పలు ఈవెంట్ల ద్వారా కేంపెయిన్ చేయడంతో పాటే.. కొన్ని డిఫరెంట్ అటెంప్ట్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. క్రియేటివ్ పార్ట్ ని త్రివిక్రమ్ హ్యాండిల్ చేయనుండగా.. టీవీషోలను నితిన్ - సమంతలు నిర్వహించేలా ప్లాన్స్ ఉన్నాయట. మరోవైపు ఆడియోను కూడా జనాల్లోకి విపరీతంగా తీసుకెళ్తున్నారు అ..ఆ.. మేకర్స్.