Begin typing your search above and press return to search.

అ..ఆ.. అసలు సంగతి మాత్రం చెప్పలేదు

By:  Tupaki Desk   |   4 May 2016 4:58 AM GMT
అ..ఆ.. అసలు సంగతి మాత్రం చెప్పలేదు
X
టాలీవుడ్లో ఈ మధ్య పెద్ద సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో చాలా గందరగోళం నడుస్తోంది. ఈ నెలలో విడుదల కావాల్సిన బ్రహ్మోత్సవం.. అ..ఆ సినిమాలు రెంటి విషయంలోనూ కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. ఐతే ఆడియో వేడుకల్లో ఓ క్లారిటీ వచ్చేస్తుందిలే అనుకున్నారు జనాలు. కానీ ‘అ..ఆ’ ఆడియో వేడుకలో మాత్రం ఆ సినిమా రిలీజ్ డేట్ సంగతేంటో తేల్చలేదు. హీరో నితిన్ కానీ.. దర్శకుడు త్రివిక్రమ్ కానీ.. మిగతా యూనిట్ సభ్యులు ఎవరు కానీ.. రిలీజ్ డేట్ ఊసే ఎత్తలేదు. చాలా మాటలు చెప్పారు కానీ.. విడుదల సంగతి ఎత్తకుండానే వేడుక ముగించేశారు. ‘అ..ఆ’ సంగతి తేలకపోవడానికి కారణం ‘బ్రహ్మోత్సవం’ సినిమానే అంటున్నారు.

బ్రహ్మోత్సవం ఎప్పుడు రిలీజవుతుందన్నదాన్ని బట్టి.. ‘అ..ఆ’ డేట్ ఖరారయ్యే అవకాశాలున్నాయి. బ్రహ్మోత్సవం మే 20 లేదా 27వ తేదీన రిలీజవుతుందని అంటున్నారు. ఐతే డేట్ విషయంలో క్లారిటీ లేదు. ఇంకా కొంచెం షూటింగ్ పెండింగ్ ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ సినిమా 20న అంటే 13న లేదా 27న ‘అ..ఆ’ కన్ఫమ్ కావచ్చు. బ్రహ్మోత్సవం 27న అయితే 13 లేదా 20న ‘అ..ఆ’ రావచ్చేమో. మరి బ్రహ్మోత్సవం సంగతేంటో మందు తేలాల్సి ఉంది. బహుశా మే 7న ఆడియో వేడుకలో బ్రహ్మోత్సవం విషయంలో క్లారిటీ వస్తుందేమో చూడాలి. నితిన్-సమంత జంటగా నటించిన ‘అ..ఆ’ను రాధాకృష్ణ నిర్మించాడు. మిక్కీజే మేయర్ సంగీతం అందించాడు.