Begin typing your search above and press return to search.

అచ్చుల పాటకు సంపూ అదిరేటి స్టెప్పులు!

By:  Tupaki Desk   |   16 July 2019 7:32 AM GMT
అచ్చుల పాటకు సంపూ అదిరేటి స్టెప్పులు!
X
మనకు టాలీవుడ్లో ఎంతో మంది స్టార్లు ఉన్నారు. యూట్యూబ్ లో కొత్తగా కసి స్టార్ బాలు కూడా వచ్చాడు. కానీ ఇలాంటి స్టార్లు ఎంతమంది ఉన్నా బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు స్థానం మాత్రం ప్రత్యేకమైనదే. 'హృదయకాలేయం' సినిమాతో సోషల్ మీడియాను షేక్ చేసిన సంపూ మొదట్లో మంచి ఊపులో ఉన్నాడు కానీ.. తర్వాత ఎందుకో స్లో అయ్యాడు. సంపూ కొత్త సినిమా 'కొబ్బరి మట్ట' రిలీజ్ చాలాకాలంగా డిలే అవుతోంది. ఆ అడ్డంకులను దాటుకొని ఫైనల్ గా ఈ సినిమాను ఆగష్టు 2 న రిలీజ్ చేసేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నారు.

రిలీజ్ కు ఇక పదిహేను రోజులే ఉండడంతో ఈ సినిమాకు ప్రమోషన్స్ మొదలుపెట్టారు. తాజాగా ఈ సినిమా నుండి 'అ ఆ ఇ ఈ' అంటూ సాగే ఒక పాట టీజర్ ను విడుదల చేశారు. ఈ సినిమాకు సంగీతం అందించిన వారు కమ్రన్. ఈ పాటసాహిత్యంలో పల్లవి అ నుండి మొదలై అం అః వరకూ సాగింది. ఈ అచ్చుల సాహిత్యానికి సంపూ రెచ్చిపోయి స్టెప్పులు వేశాడు. మన టాలీవుడ్ టాప్ స్టార్లు గతంలో వేసిన కొన్ని స్టెప్పులను ఇమిటేట్ చేస్తూ స్పూఫ్ స్టెప్పులు వేశాడు. అయితే రిథం చాలా చోట్ల మిస్ అయింది..కానీ ఉన్న మాట చెప్తే బర్నింగ్ స్టార్ అభిమానులకు కోపం వస్తుంది. వారు మళ్ళీ సోషల్ మీడియాలో విరుచుకుపడతారేమో. కానీ ఎంత రిథం మిస్ అయినా అది ప్రేక్షకులకు ఫుల్ ఫన్ ఇచ్చేలా ఉంది.

ఈ చిత్రంలో సంపూ పాపారాయుడు.. పెదరాయుడు ఆండ్రాయుడు గా త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రోమోస్ లో కూడా ఆ పాత్రలను ప్రేక్షకులకు పరిచయం చేయడం జరిగింది. ఈ సినిమాకు దర్శకుడు రూపక్ రోనాల్డ్ సన్. ఈ చిత్రాన్ని జి. శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. ఆలస్యం ఎందుకు 'అ ఆ ఇ ఈ' ని చూసేయండి.