Begin typing your search above and press return to search.

తెలుగు కంటే ముందే కన్నడంలో మొదలెట్టేశారు

By:  Tupaki Desk   |   12 Dec 2018 12:19 PM GMT
తెలుగు కంటే ముందే కన్నడంలో మొదలెట్టేశారు
X
ఈ సంవత్సరంలో కోలీవుడ్‌ లో అతి పెద్ద విజయాల్లో ఒక్కటిగా ‘96’ను చెప్పుకోవచ్చు. చిన్న చిత్రంగా తెరకెక్కిన ఆ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. టీవీల్లో వచ్చిన తర్వాత కూడా థియేటర్లలో మంచి ఆక్యుపెన్సీ రావడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. 96 చిత్రాన్ని మొదట తెలుగులో డబ్‌ చేయాలని భావించారు. దిల్‌ రాజు రైట్స్‌ కూడా కొనుగోలు చేశాడు. కాని అక్కడ సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో డబ్బింగ్‌ కంటే రీమేక్‌ అయితే బాగుంటుందని డబ్బింగ్‌ ఆలోచన వదిలేశాడు.

‘96’ రీమేక్‌ ఆ హీరో తో ఈ హీరో తో అంటూ ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయి. నాని, అల్లు అర్జున్‌ లతో పాటు ఇంకొందరు ఈ సినిమాపై ఆసక్తి చూపించారని పుకార్లు షికార్లు చేశాయి. ఈమద్య గోపీచంద్‌ ఈ చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడని కూడా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి దిల్‌ రాజు ఇంకా 96 రీమేక్‌ ను కన్ఫర్మ్‌ చేయలేదు. ఈ సమయంలోనే కన్నడంలో ఈ చిత్రం రీమేక్‌ పట్టాలెక్కినట్లుగా తెలుస్తోంది.

కన్నడంలో 96 రీమేక్‌ కు టైటిల్‌ మార్చి 99 అని పిక్స్‌ చేశారు. తమిళ వర్షన్‌ లో విజయ్‌ సేతుపతి, త్రిషు లీడ్‌ రోల్‌ లో నటించిన విషయం తెల్సిందే. కన్నడంలో గోల్డెన్‌ స్టార్‌ గణేష్‌ హీరో గా నటించబోతున్నాడు. హీరోయిన్‌ ఎవరు అనే విషయమై క్లారిటీ ఇంకా రాలేదు. గణేష్‌ వయస్సు రీత్యా ఈ చిత్రానికి టైటిల్‌ 99 అని ఖరారు చేసినట్లుగా కన్నడ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. కన్నడంలో మొన్నటి వరకు ఊసే లేదు. ఇప్పుడు చకచక సినిమాకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాని టాలీవుడ్‌ లో మూడు నెలలుగా ఈ చిత్రం గురించి ప్రచారం జరుగుతుంది కాని ఇప్పటి వరకు ఏ చిన్న క్లారిటీ కూడా రాలేదు.