Begin typing your search above and press return to search.

చిరు పార్టీకి హ్యాండిచ్చారు కానీ..

By:  Tupaki Desk   |   31 Aug 2015 3:53 AM GMT
చిరు పార్టీకి హ్యాండిచ్చారు కానీ..
X
80లలో స్టార్లంతా ఒకే వేదికపైకి ఒకే ఫ్రేములోకి వచ్చి నవ్వులు చిందిస్తుంటే ఆ సీన్‌ ఎలా ఉంటుంది? సూపర్భ్‌ అనిపించదూ.. ఇదిగో ఇక్కడున్న ఆ ఫోటో చూస్తుంటే ఆ సంగతి ఇట్టే అర్థమైపోతుంది. అంతే కాదు ఈ ఫోటోలో డ్రెస్‌ కోడ్‌ ఇంట్రెస్టింగ్‌. ఓన్లీ రెడ్‌, మౌళిన్‌ రోగ్‌ (ఎరుపు రంగు) థీమ్‌ తో కనిపించాలన్నది కండిషన్‌. దాని ప్రకారమే స్టార్లంతా డ్రెస్‌ కోడ్‌ మెయింటెయిన్‌ చేశారు.

సౌత్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ ఎలైట్‌ క్లబ్‌ గ్రూప్‌ ఫోటోలో మెగాస్టార్‌ చిరంజీవి ఎరుపు రంగుకి బ్లాక్‌ కాంబినేషన్‌ జోడించిన షర్ట్‌ లో కనిపించారు. భాగ్యరాజా, సీనియర్‌ నరేష్‌ తెల్లరంగు కోటుపై రెడ్‌ కోట్‌ వేసుకున్నారు. పూలచొక్కాయ్‌ లో జాకీష్రాప్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌. విక్టరీ వెంకటేష్‌ ఇంకాస్త డిఫరెంటుగా రెడ్‌ లోనెక్‌, కాఫీ కలర్‌ షర్ట్‌ కాంబినేషన్‌ తో కనిపించాడు. మొత్తానికి రెడ్‌ అనేది అక్కడ సింబాలిక్‌ గా కనిపించింది. నీనారెడ్డి గెస్ట్‌ హౌస్‌ (ఇసిఆర్‌-చెన్నయ్‌)లో ఈ వేడుక జరిగింది. ఈ వేడుకల్లో ఖుష్బూ లుంగీ డ్యాన్స్‌ హైలైట్‌.

ఇటీవలే మెగాస్టార్‌ పుట్టినరోజు వేడుకలకు ఇదే స్టయిల్‌ లో 'బ్లాక్‌' థీమ్‌ లో డ్రెస్‌ కోడ్‌ ఉండాలని కండిషన్‌ పెట్టారు. కానీ ఆ కండిషన్‌ ని ఎవరూ పట్టించుకోనేలేదు. బ్లాక్‌ డ్రెస్‌, బ్లాక్‌ టై కట్టుకుని కోడ్‌ మెయింటెయిన్‌ చేయాలని సూచించారు. శ్రీయ, లక్ష్మి మంచు, ఛార్మి ఇలా కొద్ది మంది మాత్రమే ఆ రూల్‌ పాటించారు. హీరోలు చాలా వరకూ మెయింటెయిన్‌ చేశారు. కానీ ఎక్కువమంది కోడ్‌, రూల్స్‌ పాటించకుండా హ్యాండిచ్చారు. ఇప్పుడు మాత్రం ఈ ఫోటోలో ఉన్న తారలంతా చాలా అటెన్షన్‌తో రెడ్‌ కోడ్‌ లో వచ్చి ఆశ్చర్యపరిచారు.