Begin typing your search above and press return to search.

అంత‌ర్జాతీయ క్రికెట్‌ లో సంచ‌ల‌నం..7 బంతులు..7 సిక్స‌ర్లు

By:  Tupaki Desk   |   15 Sep 2019 7:05 AM GMT
అంత‌ర్జాతీయ క్రికెట్‌ లో సంచ‌ల‌నం..7 బంతులు..7 సిక్స‌ర్లు
X
అంత‌ర్జాతీయ క్రికెట్‌ లో ప‌సికూన అప్గ‌నిస్తాన్ కాస్తా ప‌రుగుల కూన‌గా మారిపోతోంది. రోజు రోజుకు అప్గ‌న్ అంచ‌నాల‌కు మించి అడుతోంది. మ‌రోవైపు ఐర్లండ్‌ - జింబాబ్వే లాంటి దేశాలు రోజు రోజుకు క్రికెట్‌ లో వెన‌క‌ప‌డిపోతున్నాయి. అప్గ‌న్ మాత్రం దూసుకుపోతోంది. టెస్ట్ క్రికెట్ హోదా వ‌చ్చిన అప్గ‌న్ తాను ఆడి మూడు మ్యాచ్‌ ల‌లో రెండు మ్యాచ్‌ ల‌లో విజ‌యం సాధించి పెను సంచ‌ల‌నం క్రియేట్ చేసింది.

బెంగ‌ళూరులో భార‌త్‌ తో జ‌రిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌ లో ఓడిన అప్గ‌న్ ఆ త‌ర్వాత వ‌రుస‌గా ఐర్లండ్‌ తో పాటు పెద్ద పెద్ద దేశాల‌కే షాక్ ఇస్తోన్న బంగ్లాదేశ్‌ ను బంగ్లాదేశ్లో ఓడించి సైతం షాక్ ఇచ్చింది. బంగ్లాపై అప్గ‌న్ సాధించిన సంచ‌ల‌న విజ‌యంతో అప్గాన్‌ ను చూసి పెద్ద పెద్ద దేశాలు సైతం వ‌ణుకుతున్నాయి. ఇదిలా ఉంటే అప్గ‌న్ మరో అదిరిపోయే రికార్డు సాధించింది.

అంత‌ర్జాతీయ క్రికెట్‌ లో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ జ‌ట్టు సాధించ‌ని విధంగా 20-20 మ్యాచ్‌ ల‌లో ఏడు బంతుల్లో వ‌రుస‌గా ఏడు సిక్స‌ర్లు కొట్టిన జ‌ట్టుగా నిలిచింది. బంగ్లాదేశ్ లో జ‌రుగుతున్న ముక్కోణ‌పు 20 సీరిస్‌ లో అఫ్గానిస్తాన్‌ 28 పరుగులతో జింబాబ్వేను చిత్తుచేసింది. ముందుగా అఫ్గాన్‌ 5 వికెట్లకు 197 పరుగులు చేసింది. నజీబుల్లా జద్రాన్‌ (30 బంతుల్లో 69 నాటౌట్‌; 5 ఫోర్లు - 4 సిక్సర్లు) - మొహమ్మద్‌ నబీ (18 బంతుల్లో 38; 4 సిక్సర్లు) చెలరేగి 51 బంతుల్లో 107 పరుగులు జోడించారు.

ఈ జోడీ దెబ్బ‌కు జింబాబ్వే బౌల‌ర్లు చేష్ట‌లుడిగిపోయారు. ఈ ఇద్ద‌రు ఒకానొక ద‌శ‌లో వరుసగా 7 బంతుల్లో 7 సిక్సర్లు బాదడం విశేషం. 17వ ఓవర్‌ చివరి 4 బంతులను నబీ సిక్సర్లు కొట్టగా...18వ ఓవర్‌ తొలి 3 బంతులను జద్రాన్‌ సిక్సర్లుగా మలిచాడు. ఇప్ప‌టి వ‌ర‌కు అంత‌ర్జాతీయ 20-20 మ్యాచ్‌ల‌లో ఈ రికార్డు ఏ జట్టుకు చెందిన ఆట‌గాళ్లు కూడా సాధించ‌లేదు.