Begin typing your search above and press return to search.

ఏడు సినిమాలు దాడికొస్తున్నాయి

By:  Tupaki Desk   |   20 Jun 2018 5:30 PM GMT
ఏడు సినిమాలు దాడికొస్తున్నాయి
X
పెద్ద సినిమాల సందడి తగ్గగానే చిన్న సినిమాల సందడి మొదలవుతుంది. అన్ సీజన్లలో.. కొంచెం ఖాళీ దొరగ్గానే ఒకేసారి చాలా సినిమాల్ని రిలీజ్ చేయడం జరుగుతుంటుంది. చివరగా ఫిబ్రవరి-మార్చి నెలల్లో ఇలాగే ఇబ్బడి ముబ్బడిగా సినిమాలు రిలీజ్ చేశారు. ఒకే వీకెండ్లో ఐదు-పది సినిమాలు కూడా రిలీజ్ చేసిన సందర్భాలున్నాయి. ఐతే సమ్మర్ సీజన్లో భారీ సినిమాల హవా సాగడంతో చిన్న సినిమాలు సైడైపోయాయి. ఐతే స్కూళ్లు మొదలై పెద్ద సినిమాల సందడి తగ్గి.. మళ్లీ అన్ సీజన్ మొదలవడంతో చాన్నాళ్లుగా విడుదల కోసం చూస్తున్న చిన్నా చితకా సినిమాలన్నీ వరుస కట్టేయబోతున్నాయి. ఈ కోవలోనే వచ్చే వారాంతంలో ఏకంగా ఏడు సినిమాలు బాక్సాఫీస్ దాడికి దిగుతుండటం విశేషం.

వచ్చే వీకెండ్లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’. ‘పెళ్ళిచూపులు’ ఫేమ్ తరుణ్ భాస్కర్ రూపొందించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా యూత్ లో ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉంది. నిన్నే ఈ సినిమా రిలీజ్ డేట్ కన్ఫమ్ చేశారు. ఇది కాకుండా రాబోయే సినిమాలన్నింటి పరిస్థితి దాదాపుగా సమానం. షకలక శంకర్ హీరోగా పరిచయం కాబోతున్న ‘శంభో శంకర’.. అల్లు శిరీష్ మలయాళంలో మోహన్ లాల్ తో కలిసి నటించిన ‘యుద్ధభూమి’.. రాజమౌళి ప్రశంసలందుకున్న అడ్వెంచరస్ మూవీ ‘సంజీవని’.. నందు హీరోగా నటించిన ‘కన్నుల్లో నీ రూపమే’.. రవిచావలి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సూపర్ స్కెచ్’.. ఇంకా ‘నా లవ్ స్టోరీ’ అనే మరో చిన్న సినిమా జూన్ 29న విడుదల కాబోతున్నాయి. మరి వీటిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి మంచి ఫలితాలందుకునేవేవో చూడాలి.