7 అన్నారు 8 మంది ఉన్నారు!

Thu Oct 18 2018 20:00:01 GMT+0530 (IST)

థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతున్న '7' నుండి ఇప్పటికే పలువురు హీరోయిన్ల ఫస్ట్ లుక్స్ రిలీజ్ అయ్యాయి. తాజాగా '7' టీమ్ నుండి దసరా సందర్భంగా మరో కొత్త పోస్టర్ వచ్చింది.  దసరా శుభాకాంక్షలు తెలుపుతూ '7' టీమ్ రిలీజ్ చేసిన ఈ పోస్టర్ లో ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించిన నటులందరూ ఉన్నారు.అనీషా అంబ్రోస్.. నందితా శ్వేత.. రెజీనా కసాండ్రా.. పూజిత పొన్నాడ.. అదితి ఆర్య.. త్రిధా చౌదరి ల తో పాటు హవీష్.. రెహమాన్ లు ఈ  పోస్టర్ లో కనిపించారు.  ఈ సినిమాలో హవీష్ కార్తిక్ అనే యువకుడి పాత్ర పోషిస్తుండగా రహమాన్ విజయ్ ప్రకాష్ అనే ఐపీఎస్ అధికారి పాత్రలో కనిపిస్తాడట.  సినిమా టైటిల్.. వరసగా హీరోయిన్ల ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేయడం చూసి 7 మంది హీరోయిన్లు అనుకున్నారు గానీ ఇప్పటివరకూ 6 మంది మాత్రమే లెక్క తేలారు.  ఇక ఏడవ పాత్ర హీరో హవీష్ ది అయ్యుండవచ్చు.   రెహమాన్ ది ఐపీఎస్ పాత్ర అంటున్నారు కాబట్టి ఏదైనా కేసు ఇన్వెస్టి గేషన్ ఉండే అవకాశం ఉంది.

ఏదేమైనా ఇలాంటి విషయలపై క్లారిటీ రావాలంటే టీజర్.. ట్రైలర్ లు రిలీజ్ అయ్యేవరకూ వేచి చూడక తప్పదు. సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేస్తామని అంటున్నారు కాబట్టి త్వరలోనే మేకర్స్ టీజర్ తో పలకరించే అవకాశం ఉంది.  అంతలోపు '7' పోస్టర్ పై ఒక లుక్కేయండి.   అన్నట్టు ఈ సినిమాకు దర్శకుడు నిజార్ షఫీ..  నిర్మాత రమేష్ వర్మ.