ఫోటో స్టోరి: జెమినీ గణేశన్ కుమార్తెలు

Sat May 19 2018 12:56:06 GMT+0530 (IST)

రీసెంట్ గా వచ్చిన మహానటి సినిమా ఒక్కసారిగా బాక్స్ ఆఫీస్ ని బ్లాస్ట్ చేసింది. పెద్దగా అంచనాలతో విడుదల కానీ ఆ సినిమా ఈ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందని ఎవరు ఊహించలేదు. పైగా యూఎస్ లో స్టార్ హీరోలతో సమానంగా 2 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అయితే ఈ సినిమా సక్సెస్ తరువాత చాలా మందిలో సావిత్రి గురించి ఇంకాస్త తెలుసుకోవాలని ఆసక్తిని చూపించారు.ఆమె మరణించిన తరువాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. జెమినీ గణేశన్ పిల్లలు ఎవరెవరు అనే దానిపై జనాలు గూగుల్ - వికీపీడియా లో సెర్చ్ లు బాగానే చేస్తున్నారు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఫొటో బాగా ట్రెండ్ అవుతోంది. జెమినీ గణేషన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయనకు మొత్తంగా ఏడుగురు కుమార్తెలు. ఒక కుమారుడు. మూడవ భార్య అయిన సావిత్రికి ఒక కొడుకు(సతీష్)  కుమార్తె( విజయ చాముండేశ్వరి) ఉన్నారు.

రెండవ భార్య పుష్పవల్లికి ఇద్దరు కుమార్తెలు కాగా.. అందులో బాలీవుడ్ నటి రేఖ ఒకరు. ఇక ప్రస్తుతం వైరల్ అవుతోన్న ఫొటోలో జెమినీ గణేశన్ కుమార్తెలందరు ఉన్నారు. కమలా సెల్వారాజ్ - రేఖ - రేవతి - నారాయణి - జయ శ్రీధర్ - విజయా చాముండేశ్వరి మరియు రాధా అందరు కలిసి ఇప్పుడు కూడా వారి రిలేషన్ ని హెల్తీగా కొనసాగిస్తున్నారు అని ఆ ఫొటో చెప్పకనే చెబుతోంది.