Begin typing your search above and press return to search.

నాలుగు బాషల ఫిలిం ఫేర్ విజేతలు వీళ్ళే

By:  Tupaki Desk   |   17 Jun 2018 7:08 AM GMT
నాలుగు బాషల ఫిలిం ఫేర్ విజేతలు వీళ్ళే
X
భాషతో సంబంధం లేకుండా భారతదేశంలో ఉన్న యాక్టర్స్ అందరు క్రేజీగా ఫీల్ అయ్యే 65వ ఫిలిం ఫేర్ అవార్డ్స్ సౌత్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఎవరికి ఏవి దక్కుతాయి అనే దాని గురించి సోషల్ మీడియాతో పాటు టీవీలో సైతం రకరకాల అంచనాలు రేగాయి. పోటీ విపరీతంగా ఉండటంతో పాటు గత ఏడాది వచ్చిన అధికశాతం సినిమాల్లో క్వాలిటీతో పాటు నటీనటులందరూ పోటీపడి మరీ పెర్ఫార్మన్స్ ఇవ్వడంతో జడ్జ్ చేయటం కొంచెం కష్టమే అనిపించింది. అయినా విజేతలను నిర్ణయించాలి కాబట్టి సస్పెన్స్ ను తెరదించుతూ నిన్న వాటిని విజేతలకు ప్రకటించి అందజేశారు. ముందు నుంచి ఊహిస్తున్నట్టే తెలుగులో సింహభాగం బాహుబలి 2నే తీసేసుకుంది. ఖచ్చితంగా వస్తాయన్న సినిమాలకు రాకపోవడం చిన్న ట్విస్ట్ ఇవ్వగా ప్రభాస్ కు రాకపోవడం మాత్రం రెబెల్ స్టార్ ఫాన్స్ ని అసహనంతో ఊగిపోయేలా చేసింది. ఇక అన్ని భాషలకు సంబంధించి విజేతల వివరాలు ఈ విధంగా ఉన్నాయి

తెలుగు

ఉత్తమ చిత్రం : బాహుబలి 2

ఉత్తమ దర్శకుడు : ఎస్ ఎస్ రాజమౌళి

బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్ : విజయ్ దేవరరకొండ(అర్జున్ రెడ్డి)

బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్ (ఫిమేల్): సాయి పల్లవి(ఫిదా)

బెస్ట్ యాక్టర్(క్రిటిక్స్): వెంకటేష్(గురు)

బెస్ట్ యాక్ట్రెస్(క్రిటిక్స్): రితిక సింగ్(గురు)

బెస్ట్ సపోర్టింగ్ రోల్: రానా దగ్గుబాటి(బాహుబలి 2)

బెస్ట్ సపోర్టింగ్ రోల్(ఫిమేల్): రమ్య కృష్ణ(బాహుబలి 2)

బెస్ట్ మ్యూజిక్ : ఎం ఎం కీరవాణి(బాహుబలి 2)

బెస్ట్ లిరిక్స్ : ఎం ఎం కీరవాణి(బాహుబలి 2-దండాలయ్యా)

బెస్ట్ సింగర్ (మేల్) : హేమచంద్ర(ఫిదా-ఊసుపోదు)

బెస్ట్ సింగర్(ఫిమేల్) : మధుప్రియ(వచ్చిండే-ఫిదా)

లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు : కైకాల సత్యనారాయణ

బెస్ట్ డెబ్యూ(ఫిమేల్): కళ్యాణి ప్రియదర్శన్ (హలో)

బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ : సాబు సిరిల్ (బాహుబలి 2)

బెస్ట్ సినిమాటోగ్రాఫర్: సెంథిల్ కుమార్ (బాహుబలి 2)

బెస్ట్ కొరియోగ్రాఫర్: శేఖర్ (అమ్మడు కుమ్ముడు-వచ్చిండే మెల్లగా వచ్చిండే)

తమిళ్

బెస్ట్ ఫిలిం : అర్రం

బెస్ట్ డైరెక్టర్ : పుష్కర్ గాయత్రి(విక్రమ్ వేదా)

బెస్ట్ యాక్టర్ లీడింగ్ రోల్ (మేల్): విజయ్ సేతుపతి(విక్రమ్ వేదా)

బెస్ట్ యాక్టర్ లీడింగ్ రోల్(ఫిమేల్): నయనతార(అర్రం)

బెస్ట్ యాక్టర్ బై క్రిటిక్స్ : కార్తీ(తీరన అదిగారం ఒండ్రు - మాధవన్(విక్రమ్ వేదా)

బెస్ట్ యాక్టర్ బై క్రిటిక్స్ (ఫిమేల్): అదిరి బాలన్ (అరువి)

బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ రోల్ : ప్రసన్న( తిరిట్టుపాయలే 2)

బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ రోల్ : నిత్య మీనన్ (మెర్సల్)

బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్: ఏఆర్ రెహమాన్ (మెర్సల్)

బెస్ట్ లిరిక్స్ - వైరముత్తు(కాట్రు వెలియాదే)

బెస్ట్ సింగర్ మేల్ : అనిరుద్ రవిచందర్ (యాంజీ-విక్రమ్ వేదా)

బెస్ట్ సింగర్ ఫిమేల్ : షాషా తిరుపతి (వాన్- కాట్రు వెలియాదే)

కన్నడ

బెస్ట్ ఫిలిం : ఓందు మొట్టేయ కథే

బెస్ట్ డైరెక్టర్ : తరుణ్ సుధీర్ (చౌకా)

బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్ : పునీత్ రాజ్ కుమార్(రాజకుమార)

బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్ ఫిమేల్ : శృతి హరిహరన్ (బ్యూటిఫుల్ మనసుగలు)

బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్ : ధనుంజయ(అల్లమా)

బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్ ఫిమేల్ : శ్రద్ధ శ్రీనాధ్ (ఆపరేషన్ అలమేలమ్మా)

బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ రోల్ : రవి శంకర్ (కాలేజీ కుమార్)

బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ రోల్ ఫిమేల్ : భవాని ప్రకాష్ (ఉరువి)

బెస్ట్ మ్యూజిక్ : బిజె భరత్ (బ్యూటిఫుల్ మనసుగలు)

బెస్ట్ లిరిక్స్ - నాగేంద్ర ప్రసాద్ (అప్పా ఐ లవ్ యు- చౌకా)

బెస్ట్ సింగర్ మేల్ : అర్మాన్ మాలిక్ (ఓందు మలెబిల్లు - చక్రవర్తి)

బెస్ట్ సింగర్ ఫిమేల్ - అనురాధ భట్ (అప్పా ఐ లవ్ యు- చౌకా)

మలయాళం

బెస్ట్ ఫిలిం : తొండిముత్తాలుమ్ ద్రిక్సాక్శియుమ్

బెస్ట్ డైరెక్టర్ - దినేష్ పోతేన్ (తొండిముత్తాలుమ్ ద్రిక్సాక్శియుమ్ )

బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్ : ఫహాద్ ఫాజిల్ (తొండిముత్తాలుమ్ ద్రిక్సాక్శియుమ్ )

బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్ ఫిమేల్ : పార్వతి (టేక్ ఆఫ్)

బెస్ట్ యాక్టర్ బై క్రిటిక్స్ : తోవినో థామస్ (మాయంది)

బెస్ట్ యాక్టర్ బై క్రిటిక్స్ ఫిమేల్ : మంజు వారియర్ (ఉదారణం సుజాతా)

బెస్ట్ సపోర్టింగ్ రోల్ యాక్టర్ : అలెన్సియర్ (తొండిముత్తాలుమ్ ద్రిక్సాక్శియుమ్ )

బెస్ట్ సపోర్టింగ్ రోల్ యాక్టర్ ఫిమేల్ : శాంతి కృష్ణ (న్యాన్జుకలుడే నత్తిల్ ఓరు ఇదవెల్ల)

బెస్ట్ మ్యూజిక్ : రెక్స్ విజయన్ (మయానది)

బెస్ట్ సింగర్ మేల్ : షాబాజ్ అమన్ (మిజయుల్ నిన్ను - మయానది)

బెస్ట్ సింగర్ ఫిమేల్ : కెఎస్ చిత్ర (నదావతిల్- కాంభోజి)

డెబ్యూ అవార్డ్స్

బెస్ట్ డెబ్యూ మేల్ తమిళ్ : వసంత్ రవి(తారామణి)

బెస్ట్ డెబ్యూ మేల్ మలయాళం : ఆంటోనీ వర్గీస్ (అంగమలి డైరీస్)

బెస్ట్ డెబ్యూ ఫిమేల్ మలయాళం : ఐశ్వర్య లక్ష్మి( న్యాంజుకలుడే నాటిల్)


మొత్తానికి నాలుగు బాషలలో కంటెంట్ కె పట్టం కట్టిన ఫిలిం ఫేర్ నిర్వాహకులు తెలుగులో మాత్రం అగ్ర తాంబూలం బాహుబలికె ఇచ్చేసారు. ప్రభాస్ అనుష్కలకు ఒక్క అవార్డు కూడా దక్కకపోవడం విశేషమైతే జాతీయ అవార్డు దక్కించుకున్న శతమానం భవతికి తగిన స్థానం దక్కకపోవడం కూడా వింతే. తమిళ్ లో సైతం అర్రం, విక్రమ్ వేదాలకు దక్కిన గుర్తింపు ఇతర చిత్రాలకు దొరకలేదు. అందరికి న్యాయం చేయటం ఇలాంటి అవార్డ్స్ లో కష్టం కనక ఇవి సమంజసమా కదా అనే చర్చ అనవసరం. కళ్ళు చెదిరే తారల తళుకుల మధ్య జరిగిన ఈ వేడుక త్వరలోనే బుల్లితెర ప్రేక్షకులను అలరించనుంది.