Begin typing your search above and press return to search.

2018లో 65 పాట‌లు రాసినోడు!

By:  Tupaki Desk   |   13 Dec 2018 4:33 AM GMT
2018లో 65 పాట‌లు రాసినోడు!
X
లిరిక్ రాయ‌డ‌మెలా? ఇది ఎప్పుడూ ఔత్సాహిక పాట‌ల ర‌చ‌యిత‌ల‌కు ఓ పెద్ద క్వ‌శ్చ‌న్ మార్క్‌! అదేదో బ్ర‌హ్మ‌ప్ర‌దార్థంలా ఫీల‌వుతారు కొంద‌రైతే. అయితే అస‌లు లిరిక్ రాయాల‌న్న త‌ప‌న ఉండాలే కానీ అదేమంత క‌ష్టం కాదు. అంద‌రూ సిరివెన్నెల సీతారామ శాస్త్రిలానే సాహితీవేత్త‌లు కాన‌వ‌స‌రం లేద‌న్న విశ్లేష‌ణ టాలీవుడ్‌ లో ఉంది. పాటల ర‌చ‌యిత‌లు ఉప‌యోగించే కొన్ని టెక్నిక్స్ తెలిస్తే అటు పై సాధ‌న చేసేవాళ్ల‌కు క‌ష్టం కాద‌ని అర్థ‌మైపోతుంద‌ని కొంద‌రు లిరిసిస్టులు చెబుతుంటారు. అపార‌మైన విజ్ఞానం సంపాదిస్తే స‌బ్ కాన్షియ‌స్ మైండ్‌ లో ఉండే ప‌దాలు పాట‌ల ప‌ల్ల‌కీ ఎక్కుతాయ‌ని మా చ‌క్క‌గా టాప్ సీక్రెట్‌ ని లీక్ చేశాడు ఈ యువ లిరిస్ట్‌. అన్న‌ట్టు .. ఎవ‌రీయ‌న‌?

ఆయ‌న వేటూరి కాదు.. శాస్త్రి గారు అస‌లే కాదు. క‌నీసం రా.జో.శాస్త్రి అయినా కాదు. కానీ అత‌డు ఒకే ఏడాదిలో 65 పాట‌లు రాయ‌డం ఓ సెన్సేష‌న్. ఇండ‌స్ట్రీ బిజీ లిరిస్టు ఆయ‌నే ఇప్పుడు. అది కూడా రెగ్యుల‌ర్‌ గా ఉద్యోగం చేసుకుంటూనే, ఖాళీ స‌మ‌యాల్లో ఈ ఫీట్ వేసాడు స‌ద‌రు యువ‌ లిరిసిస్టు. ఈ టెక్నిక్ ఏందో మాక్కూడా చెప్పండి గురూ.. నేర్చుకుంటాం! అని ప్ర‌శ్నించిన వారికి అత‌డు అదిరిపోయే లీకేజీ కూడా ఇచ్చాడు.

పాట రాయాలంటే రికార్డింగ్ స్టూడియోల వ‌ర‌కూ వెళ్లాలా? చేసే ఉద్యోగం మానుకుని స్టూడియోల చుట్టూ తిరుగుతూ, ద‌ర్శ‌క‌నిర్మాత‌ల కొంగు చాటున చ‌క్క‌ర్లు కొట్టాలా? అంటే అబ్బే అదేం అవ‌స‌రం లేద‌ని ఆ సందేహానికి అత‌డు చెక్ పెట్టేశాడు. అస‌లు పాట రాయాలంటే అవేవీ అవ‌స‌ర‌మే లేదు. ముందు దిల్లుండాలి. మ‌న‌సుంటే మార్గం లేక‌పోలేదు. ఇండ‌స్ట్రీలో బెస్ట్ ప‌రిచ‌యాల్ని ఇలా సాహితీ ప్ర‌క్రియ‌కు జోడించ‌వ‌చ్చు అని ప్రాక్టిక‌ల్‌ గా చెప్పాడు. కేవ‌లం ఈ ఒక్క ఏడాది(2018)లో ఏకంగా 65 పాట‌లు రాశాడాయ‌న‌. ఇంత‌కీ ఎవ‌రీయ‌న అంటే పేరు కృష్ణ కాంత్. `అందాల రాక్ష‌సి` సినిమాతో కెరీర్ జ‌ర్నీ ప్రారంభించి ఇప్ప‌టికే బోలెడ‌న్ని పాట‌లు రాశాడు. ఎక్కువ‌గా ప్రేమ‌క‌థా చిత్రాల‌కు యుగ‌ళ‌గీతాల్ని, మెలోడీల్ని రాశారాయ‌న‌.

ప్ర‌స్తుతం హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్కిస్తున్న `ప‌డి ప‌డి లేచే మ‌న‌సు` చిత్రానికి ఆయ‌నే సింగిల్ కార్డ్ పాట‌లు రాశారు. కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ‌- మ‌ళ్లీరావే- ట్యాక్సీవాలా చిత్రాల‌కు బంప‌ర్ హిట్ సాంగ్స్‌ని ఇచ్చారు. ఇప్ప‌టికిప్పుడు డ‌జ‌ను సినిమాల‌కు పాట‌లు రాస్తున్నాడు. జెర్సీ- క‌ల్కీ- ప్ర‌భాస్ 20 చిత్రాల‌కు ఆయ‌నే పాట‌ల ర‌చ‌యిత‌. వేటూరి స్ఫూర్తితో- శాస్త్రిగారి పై ప్రేమ‌తో సైలెంటుగా దూసుకొచ్చిన ఈ యువ‌ ర‌చ‌యిత ఇప్ప‌టివ‌ర‌కూ టాలీవుడ్‌ లో ఉన్న అంద‌రు స్టార్ మ్యూజిక్ కంపోజ‌ర్ల‌తో ప‌ని చేశార‌ట‌. ఏ.ఆర్‌.రెహ‌మాన్, ఎం.ఎం.కీర‌వాణి మిన‌హా అంద‌రితోనూ ప‌ని చేశాన‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఉన్న అర‌డ‌జ‌ను యువ ద‌ర్శ‌కులు త‌న‌కు ఎంతో క్లోజ్ అని చెబుతున్నారు. వాళ్ల ప్రోత్సాహంతోనే ఇదంతా సాధ్య‌మైంద‌ని, ఓవైపు మీడియా జాబ్ చేస్తూనే, ట్యూన్ మెయిల్‌ లో వ‌స్తే దానికి పాట రాసి పంపుతాన‌ని చెప్ప‌డం ఇక్క‌డ కొస‌మెరుపు. అంటే ఇండ‌స్ట్రీని ఇలా కూడా డీల్ చేయొచ్చా? అని కొత్త ఐడియాని ఇచ్చాడు స‌ద‌రు యువ‌లిరిసిస్ట్. బావుంద‌య్యో కృష్ణ‌య్యా!!