Begin typing your search above and press return to search.

లండన్‌ లో ఎన్టీఆర్‌ 60 లక్షల సెట్‌

By:  Tupaki Desk   |   30 Aug 2015 8:31 AM GMT
లండన్‌ లో ఎన్టీఆర్‌ 60 లక్షల సెట్‌
X
ఎన్టీఆర్‌ కోసం సుకుమార్‌ అసాధారణ ఫీట్స్‌ వేస్తున్నాడు. అతడు లండన్‌ లోని గళ్లీ గళ్లీని చుట్టేస్తున్నాడు. కళాదర్శకుడు రవీందర్‌ తో కలిసి లొకేషన్స్‌ ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నాడు. ఏ ఖరీదైన భవంతిని వదిలిపెట్టడం లేదు. అందమైన లొకేషన్లన్నిటిని నాన్నకు ప్రేమతో సినిమాలో చూపించేయాలని, రిచ్‌ నెస్‌ కి పరాకాష్ట ఎలా ఉంటుందో చూపించేయాలని తహతహలాడుతున్నాడు. ఎన్టీఆర్‌ గెటప్‌ లో రిచ్‌ లుక్‌ తెచ్చాడు. వెరైటీ యాక్షన్‌ సీన్స్‌ ని డిజైన్‌ చేసి, తనకి ఉన్న రిచ్‌ మైండ్‌ సెట్‌ ని రివీల్‌ చేశాడు.

ఇప్పుడు మరో అరుదైన ఫీట్‌ వేశాడు. లండన్‌ లోని అధారిటి హెడ్‌ క్వార్టర్స్‌ 26వ అంతస్తులో ఓ ఖరీదైన సెట్‌ వేయించాడు. దీనికోసం ఏకంగా 60లక్షలు ఖర్చయ్యింది. అది జగపతిబాబు ఆఫీస్‌. ఓ మల్టీ మిలియనీర్‌ (అపరకుబేరుడు) ఆఫీసు అంటే ఎలా ఉండాలి? అల్ట్రారిచ్‌ గా కనిపించాలి. ఈ విషయంలో సుక్కూ ఎక్కడా రాజీకి రాలేదు. కళాదర్శకుడు రవీందర్‌ తో కలిసి పై అంతస్తులో సెట్‌ వేయాల్సిందేనని డిసైడ్‌ అయ్యాడు. అంతే వెంటనే లండన్‌ ఫిలిం యూనియన్‌ సాయం కూడా తీసుకుని పదిరోజులు శ్రమించి సెట్‌ నిర్మించారు. ఇందులో ఎన్టీఆర్‌ -జగపతిబాబుపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఇండోర్‌ సన్నివేశాలే కాబట్టి ఇండియాలోనే ఏదో మ్యాజిక్‌ చేసేద్దాం అని అనుకోలేదు. నేచురాలిటీ కోసం రియల్‌ లొకేషన్‌ లోనే సెట్‌ వేసి షూట్‌ చేస్తున్నామని రవీందర్‌ చెబుతున్నాడు. ఎన్టీఆర్‌ కోసం సుక్కూ ఎలాంటి సాహసాలు చేస్తున్నాడో ఇప్పుడర్థమైందా?